లేటెస్ట్ గ వచ్చిన బడ్జెట్ బిగ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్..!!

HIGHLIGHTS

ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్

ఆగష్టు 3వ తేదీ నుండి ఈ స్మార్ట్ ఫోన్ Flipakrt నుండి లభిస్తుంది

ఈ ఫోన్ 3GB RAM మరియు 64GB స్టోరేజ్‌తో వస్తుంది

ఇన్ఫినిక్స్ సరికొత్తగా ఇండియాలో ప్రవేశపెట్టిన Infinix Smart 6 Plus స్మార్ట్ ఫోన్ మొదటిసారిగా సేల్ కి రానుంది. ఆగష్టు 3వ తేదీ నుండి ఈ స్మార్ట్ ఫోన్ Flipakrt నుండి లభిస్తుంది. 8 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. కానీ, ఈ బడ్జెట్ ధరలోనే బిగ్ బ్యాటరీ,  గేమింగ్ ప్రాసెసర్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో తీసుకొచ్చింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనేముందుగా మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వుంది. 

Infinix Smart 6 Plus: ధర మరియు సేల్

Infinix Smart 6 Plus స్మార్ట్ ఫోన్ 3GB RAM మరియు 64GB స్టోరేజ్‌తో వస్తుంది దీని ధర కేవలం రూ.7,999. ఇది మిరాకిల్ బ్లాక్ మరియు ట్రాంక్విల్ సీ బ్లూ రంగులలో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆగష్టు 3 నుండి Flipkart ద్వారా సేల్ కి వస్తుంది.

Infinix Smart 6 Plus : స్పెక్స్

ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక పెద్ద 6.82 ఇంచ్ HD + డ్రాప్ నాచ్ డిస్ప్లేని 20.5:9 యాస్పెక్స్ట్ రేషియాతో కలిగివుంది. ఈ ఫోన్ 3 జిబి ర్యామ్ మరియు 3GB వరకు వర్చువల్ ర్యామ్ తో పాటుగా 64 జిబి స్టోరేజ్ ‌తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G25 ఆక్టా కోర్ ప్రాసెసర్ ‌శక్తితో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ పైన నడుస్తుంది. ఇది 512GB వరకు మెమరీని పెంచడానికి ప్రత్యేకమైన 3-ఇన్ -1 SD కార్డ్ స్లాట్‌ తో వస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఫోటోలను అందించే కెమెరాతో రూపొందించబడింది. ఇది 8MP AI డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోనులో ఎఫ్ / 2.0 ఎపర్చరుతో 5MP సెల్ఫీ కెమెరా, AI HDR, బ్యూటీ మోడ్ మరియు  పోర్ట్రెయిట్ మరియు వైడ్ సెల్ఫీ వంటి మల్టి కెమెరా మోడ్లు ఉన్నాయి. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :