బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్ లను అందిస్తున్న మొబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్, మరొక కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్లతో తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అదే, Infinix Hot 12 Play స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను మే 23 న ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆశ్చర్యకరమైన విష్యం ఏమిటంటే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడాని కంటే ముందుగానే ధరలను గురించి టీజ్ చేస్తోంది. టీజర్ ప్రకారం, ఈ ఫోన్ ను రూ.8,XXX ధరతో ప్రకటించనున్నట్లు సూచించింది.
అంటే, ఈ ఫోన్ ను 9 వేల కంటే తక్కువ ధరలో విడుదల చేస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ భారీ ఫీచర్లతోనే వస్తున్నట్లు టీజర్ ద్వారా అర్ధమవుతోంది. ఈ ఫోన్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా Flipkart టీజింగ్ చేసింది. అంటే, ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా వస్తోంది.
ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్మార్ట్ ఫోన్ టీజర్ ద్వారా కొన్ని కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా వెల్లడించింది. టీజర్ ద్వారా, ఈ ఫోన్ ఎంటర్టైన్మెంట్ కు అనుకూలమైన పెద్ద 6.82 ఇంచ్ HD+ డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే గేమింగ్ మరియు స్పోర్ట్స్ కంటెంట్ కోసం ఉపయోగకరమైన 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ వస్తుంది.
అంతేకాదు, ఈ ఫోన్ వేగవంతమైన Unisoc T610 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగివుంది. అలాగే, ఇందులో స్టోరేజ్ ను కూడా 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేసింది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో భారీ 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. వెనుక 50MP డ్యూయల్ కెమెరా సెటప్ మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ను కూడా కలిగి ఉంటుంది.