Infinix Hot 12 Play: బడ్జెట్ 6,000mAh బ్యాటరీ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్..!!

Infinix ఈ నెలలో తన 12 సిరీస్ నుండి అబడ్జెట్ ధరలో మంచి ఫోన్లను అందించింది. ఇటీవల కేవలం రూ. 8,499 ధరలో భారీ 6,000 mAh హెవీ బ్యాటరీతో ప్రకటించిన స్మార్ట్ ఫోన్ Infinix Hot 12 Play మొదటిసారిగా అమ్మకాలను కొనసాగించనుంది. కేవలం పెద్ద బ్యాటరీ మాత్రమే కాదు, 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన బిగ్ డిస్ప్లే తో, 4జీబీ ర్యామ్ కి జతగా 3GB వర్చువల్ ర్యామ్ తో ను కూడా ఈ ఫోన్ లో జతచేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఎల్లుండి, అంటే మే 30 వ తేదీ నుండి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ మరి ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఏమిటో చూద్దామా. 

Infinix Hot 12 Play: ధర మరియు సేల్

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్మార్ట్ ఫోన్ ను కేవలం 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో సింగల్ వేరియంట్ తో మాత్రమే అందించింది మరియు దీని ధర కేవలం రూ.8,499. ఈ ఫోన్ మే 30 వ తేదీ నుండి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది.        

Infinix Hot 12 Play: స్పెక్స్ మరియు ఫీచర్లు

ఇన్ఫినిక్స్ హాట్ 12 ప్లే స్మార్ట్ ఫోన్ ఎంటర్టైన్మెంట్ కు అనుకూలమైన పెద్ద 6.82 ఇంచ్ HD+ డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే గేమింగ్ మరియు స్పోర్ట్స్ కంటెంట్ కోసం ఉపయోగకరమైన 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ వస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన Unisoc T610 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 3GB వర్చువల్ ర్యామ్ ను కూడా కలిగివుంది. అలాగే, ఇందులో స్టోరేజ్ ను కూడా 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేసింది.

ఆప్టిక్స్ పరంగా, హాట్ 12 ప్లే వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగివుంది. ఇందులో, 13MP ప్రధాన కెమెరాకి జతగా డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే, పంచ్ హోల్ కటౌట్ లో 8ఎంపి సెల్ఫీని కూడా అందించింది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో భారీ 6,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా XOS 10 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.    

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :