ఈరోజు Infinix Hot 10s ను కేవలం పది వేల రూపాయల కంటే తక్కువ ధరకే యువతకు కావాల్సిన అన్ని హంగులతో పాటుగా చాలా స్టైలిష్ డిజైన్ తో లాంచ్ చేసింది. బడ్జెట్ వినియోగధారులను ఆకర్షించే విధంగా ఇన్ఫినిక్స్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇండియన్ మార్కెట్లో చాలా తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో చాలా స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టిన ఇన్ఫినిక్స్.
Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్ లలో ప్రకటించింది. వీటిలో, Infinix Hot 10s (4జీబీ + 64 జీబీ ) స్టార్టింగ్ వేరియంట్ ను రూ.9,999 ధరతో, మరియు (6జీబీ + 64 జీబీ ) వేరియంట్ ను రూ.10,999 ధరతో ప్రవేశపెట్టింది. మే 27 న Flipkart నుండి మొదటి సేల్ జరుగుతుంది. అంతేకాదు, ఫ్యాన్స్ కోసం స్పెషల్ సేల్ లాంచ్ డిస్కౌంట్ అఫర్ క్రింద రూ.500 రూపాయల తగ్గింపును కూడా అఫర్ చేస్తోంది.
Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ పెద్ద 6.82 -అంగుళాల HD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లే. ఇది 90.6% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది మరియు NEG Dinorex గ్లాస్ ప్రొటక్షన్ తో పైన చిన్న నోచ్ డిజైన్ ని అందించింది.
ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో G85 గేమింగ్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది ఆక్టా-కోర్ CPU. ఇది 6GB RAM మరియు 64GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది COD, PUBG, Free Fire వంటి గేమ్స్ ని కూడా చక్కగా నిర్వహించగలదు. అలాగే, ఇది XOS 7.6 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.
ఇక కెమెరాల విషయంలో, ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10s వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో, ప్రధాన కెమెరాని 48MP సెన్సార్ తో అందించింది. దీనికి జతగా 2MP డెప్త్ సెన్సార్ మరియు AI లెన్స్ కెమెరాలను జతచేసింది. ముందు భాగంలో, 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ పెద్ద 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంటుంది. ఆడియో పరంగా కూడా ఇందులో DTS Surround సౌండ్ ని కూడా అందించింది. ఓవరాల్ గా చెప్పాలంటే తక్కువ ధరలో మంచి ఫోన్ అందుకోవచ్చు.