లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ బెస్ట్ డీల్స్

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ సేల్ భారీ డీల్స్

infinix Hot 10s పైన భారీ డీల్స్

ఈ అఫర్ రేపటితో ముగుస్తుంది

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ భారీ డీల్స్ ప్రకటించింది. 19 వ తేదీ నుండి మొదలైన మొబైల్స్ బొనాంజా సేల్ రేపటితో ముగుస్తుండగా ఈ సేల్ నుండి రీసెంట్ గా విడుదలైన infinix Hot 10s లేటెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ పైన భారీ డీల్స్ అందించింది. ఇన్ఫినిక్స్ ఇండియాలో లేటెస్ట్ గా లాంచ్ చేసిన Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ గేమింగ్ ప్రోసెసర్, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది.    

Infinix Hot 10s : ధర మరియు ఆఫర్లు

Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్ లలో ప్రకటించింది. వీటిలో, Infinix Hot 10s  (4జీబీ + 64 జీబీ ) స్టార్టింగ్ వేరియంట్ ను రూ.9,999 ధరతో, మరియు (6జీబీ + 64 జీబీ ) వేరియంట్ ను రూ.10,999 ధరతో ప్రవేశపెట్టింది. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 500 రూపాయల డిస్కౌంట్ తో రూ.9,499 రూపాయలకే సేల్ చేస్తోంది. అధనంగా, ICICI, Indusind, SBI బ్యాంక్ కష్టం,కస్టమర్లకు Amex నెట్వర్క్ చేత ఇస్యూ చెయ్యబడిన కార్డ్స్ తో కొనుగోలు చేసేవారికి 20% తగ్గింపు అఫర్ చేస్తోంది. Check Offer Here         

Infinix Hot 10s : ప్రత్యేకతలు

Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ పెద్ద 6.82 -అంగుళాల HD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లే. ఇది 90.6% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది మరియు NEG Dinorex  గ్లాస్ ప్రొటక్షన్ తో పైన చిన్న నోచ్ డిజైన్ ని అందించింది.

ఈ ఫోన్ మీడియా టెక్  హీలియో G85 గేమింగ్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది ఆక్టా-కోర్ CPU. ఇది 6GB RAM మరియు 64GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది COD, PUBG, Free Fire వంటి గేమ్స్ ని కూడా చక్కగా నిర్వహించగలదు. అలాగే, ఇది XOS  7.6 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

ఇక కెమెరాల విషయంలో, ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10s వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో, ప్రధాన కెమెరాని 48MP సెన్సార్ తో అందించింది. దీనికి జతగా 2MP డెప్త్ సెన్సార్ మరియు AI లెన్స్ కెమెరాలను జతచేసింది. ముందు భాగంలో, 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ పెద్ద 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.  ఆడియో పరంగా కూడా ఇందులో DTS Surround సౌండ్ ని కూడా అందించింది. ఓవరాల్ గా చెప్పాలంటే తక్కువ ధరలో మంచి ఫోన్ అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :