Amazon GFF Sale: ఇండియన్ బ్రాండ్ 5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్..!

HIGHLIGHTS

Amazon GFF Sale బెస్ట్ 5G మొబైల్ అఫర్

Amazon GFF Sale నుండి 5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది

ఇండియన మొబైల్ తయారీ సంస్థ నుండి వచ్చిన మొట్టమొదటి 5G స్మార్ట్ ఫోన్

Amazon GFF Sale నుండి భారతీయ మొబైల్ బ్రాండ్ 5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అదే, LAVA Agni 5G స్మార్ట్ ఫోన్ మరియు అమెజాన్ సేల్ నుండి 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఇండియన మొబైల్ తయారీ సంస్థ నుండి వచ్చిన మొట్టమొదటి 5G స్మార్ట్ ఫోన్ LAVA Agni 5G మరియు ఇప్పుడు అమెజాన్ సేల్ నుండి చాలా చవక ధరకే లభిస్తోంది. లావా అగ్ని 5జి అతితక్కువ ధరలో లేటెస్ట్ 5G ప్రోసెసర్, 64MP క్వాడ్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.  

LAVA Agni 5G: ధర మరియు ఆఫర్లు

LAVA Agni 5G కేవలం 8జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్ లోలభిస్తుంది. ప్రారంభంలో రూ.19,999 రూపాయల ధరతో వచ్చిన ఈ ఈ ఫోన్ ను అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి 4,000 రూపాయల్ డిస్కౌంట్ తో కేవలం రూ.15,999 రూపాయల అఫర్ ధరకే పొందవచ్చు. అంతేకాదు, SBI బ్యాంక్ కార్డ్  అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారికి 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందుతుంది. Buy From Here    

LAVA Agni 5G: స్పెసిఫికేషన్స్

ఈ లావా 5G ఫోన్ పెద్ద 6.78 అంగుళాల FHD+ పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో అందించింది మరియు ఇది 2.5D కర్వ్డ్ స్క్రీన్ . ఈ ఫోన్‌లో స్పీడ్, గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ అందించడానికి మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC ని కలిగి వుంది.

ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2.4 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC మరియు Arm Mali-G57 MC2 GPU తో జతగా ఉంటుంది మరియు 6nm ప్రోసెసర్. ఇది మంచి గేమింగ్ మరియు 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన స్టాక్ ఆండ్రాయిడ్ 11 పైన నడుస్తుంది మరియు ఎటువంటి బ్లాట్ వేర్ లేకుండా అప్డేట్స్ ను త్వరగా అందుకుంటుంది.

లావా అగ్ని 5G స్మార్ట్ ఫోన్ వెనుక అందమైన డిజైన్ లో క్వాడ్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 64ఎంపి ప్రధాన కెమెరా, 5ఎంపి  వైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ లను అందించింది మరియు డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 16ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.

లావా అగ్ని 5G ఫోన్ 5000 mAh బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది.                      

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :