భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Micromax రీ ఎంట్రీ

Updated on 18-Aug-2020
HIGHLIGHTS

భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రోజున భారతదేశంలో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ట్విట్టర్ లో విడుదల చేసిన టీజర్ లో మైక్రోమాక్స్ “coming back soon” అని ప్రకటించింది.

భారతదేశ మొబైల్ ఫోన్స్ పట్ల వినియోగదారుల డిమాండ్ పెరుగుదల మధ్య Micromax, Karbonn మరియు Lava దేశంలో కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించాయి.

భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రోజున భారతదేశంలో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్ లో విడుదల చేసిన టీజర్ లో మైక్రోమాక్స్ “coming back soon” అని ప్రకటించింది. చైనా వ్యతిరేక భావాలు పెరుగుతున్న మరియు భారతదేశ మొబైల్ ఫోన్స్ పట్ల వినియోగదారుల డిమాండ్ పెరుగుదల మధ్య  Micromax, Karbonn మరియు Lava దేశంలో కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించాయి.

 

https://twitter.com/Micromax__India/status/1294508736464134144?ref_src=twsrc%5Etfw

 

మైక్రోమాక్స్ నుండి చివరిగా వచ్చిన ఫోన్ iOne Note, ఇది అక్టోబర్ 2019 లో తిరిగి ప్రారంభించబడింది మరియు ఇప్పుడు చైనా మొబైల్ తయారీదారులైన షియోమి, రియల్ మీ , ఒప్పో మరియు వివో లకు పోటీగా నిలబడాలని కంపెనీ కోరుకుంటుంది. సెప్టెంబరులో ప్రారంభించబోయే మూడు స్మార్ట్ఫోన్స్ కోసం కంపెనీ పనిచేస్తుందని రూమర్లు వచ్చాయి. అయితే, సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ ఒక ప్రకటనలో చాలా స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు ధృవీకరించారు మరియు 2021 ముగింపు నాటికీ రీసెర్చ్ మరియు డెవలప్ మెంట్ కోసం 500 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.

మైక్రోమాక్స్ నుండి మల్టి స్మార్ట్ ఫోన్

మైక్రోమాక్స్ ఒకప్పుడు భారతీయ మార్కెట్లో numero-uno మొబైల్ ఫోన్ బ్రాండ్, అయితే షియోమి, వివో, ఒప్పో మరియు మరిన్ని చైనా బ్రాండ్ల ప్రవేశం నుండి, ఈ భారతీయ మొబైల్ బ్రాండ్ తన పట్టును కోల్పోయి నెమ్మదిగా మార్కెట్ నుండి కనుమరుగైంది. ఇప్పటికే ఉన్న ఫోన్ ను తన సొంత లేబుల్ తో రీబ్రాండ్ చేసి భారతదేశంలో విక్రయించినందుకు కూడా కంపెనీ ప్రసిద్ధి చెందింది.

మైక్రోమాక్స్ భారతదేశంలో ఏటా 20 మిలియన్ ఫోన్ లను ఉత్పత్తి చేయగలదు మరియు దాని రాబోయే ఫోన్స్  వివరాలు ప్రస్తుతం చాలా తక్కువ. అయితే, మైక్రోమాక్స్ ఫోన్స్  మొదటి వేవ్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లు రూ .7 వేల నుంచి రూ .15 వేల మధ్య ఉంటుందని రూమర్లు సూచిస్తున్నాయి. ఇంతకు ముందు నివేదించినట్లుగా ఈ ఫోన్ లు మీడియాటెక్ చిప్ సెట్ల ద్వారా శక్తిని పొందుతాయి మరియు మరిన్ని వివరాలు లాంచ్ తేదీ నాటికీ తెలుస్తాయి.

లావా మొబైల్స్ భారతదేశంలో కొత్త స్మార్ట్ఫోన్లను ప్రకటించడం ప్రారంభించింది మరియు ఇటీవల భారతదేశంలో లావా జెడ్ 66 ను రూ .7,777 ధరతో విడుదల చేసింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, లావా తన ప్రత్యేక ఎడిషన్ పోర్ట్ఫోలియో స్మార్ట్ఫోన్లు మరియు ఫీచర్ ఫోన్లను ప్రకటించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :