అమెజాన్ సేల్ నుండి Redmi Note 9 PRo Max పైన భారీ ఆఫర్లు

HIGHLIGHTS

ఎక్స్టెండ్ చేయబడిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ హ్యాపీ అప్ గ్రేడ్ సేల్ నుంచి మంచి ఆఫర్లను ప్రకటించింది.

Redmi Note 9 PRo Max స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్ తో పాటుగా మంచి ఆఫర్లతో అమ్ముడవుతోంది.

ఈ సేల్ నుంచి రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ అతితక్కువ ధరకే మీ సొంతం.

ఎక్స్టెండ్ చేయబడిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ హ్యాపీ అప్ గ్రేడ్ సేల్ నుంచి మంచి ఆఫర్లను ప్రకటించింది. ఈ అమెజాన్ సేల్ నుంచి షియోమీ యొక్క Redmi Note 9 PRo Max స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్ తో పాటుగా మంచి ఆఫర్లతో అమ్ముడవుతోంది. ఈ సేల్ నుంచి అతితక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చు. ముందుగా, 16,999 రూపాయల ధరతో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్, ఈ అమెజాన్ సేల్ నుండి 1000 డిస్కౌంట్ తో రూ.15,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అయితే, ఈ ఫోన్ పైన మరో 3,000 రుపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. అది ఎలాగ పొందాలి అని ఈ క్రింద తెలుసుకోండి.

Redmi Note 9 PRo Max పైన అమెజాన్ ఈ సేల్ నుండి మంచి బ్యాంక్ ఆఫర్లను ప్రకటించింది. ఈ బ్యాంక్ ఆఫర్లతో మీరు 3,000 రుపాయల వరకూ తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, ఈ అఫర్ Axis, Citi మరియు ICICI బ్యాంక్ వినియోగదారులకు మాత్రమే అందుతుంది. ఎందుకంటే, ఈ మూడు బ్యాంకుల డెబిట్, క్రెడిట్ మరియు EMI తో కొనేవారికి ఈ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నాయి.

అమెజాన్ సేల్ నుంచి రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ను క్రెడిట్ /డెబిట్ మరియు క్రెడిట్ /డెబిట్ EMI ఆఫర్లతో కొనేవారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే,  బ్యాంక్ షరతులు ఒక్కసారి చూసి కొనాలని మాత్రం గుర్తుంచుకోండి.           

రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ అఫర్ ధర                     

రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ( 6GB +64GB ) -Rs.15,999 ( Buy Here )

రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ స్పెషిఫికేషన్లు

రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్, ఒక 6.67 అంగుళాల పరిమాణంగల డాట్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది 2400×1080 పిక్సెళ్ళు అంటే FHD+ రిజల్యూషన్ తో వస్తుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్,  కొత్త వేగవంతమైన ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 720G SoC శక్తితో పనిచేస్తుంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు వేగంగా పనిచేస్తుంది. ఇది 618 GPU తో వస్తుంది కాబట్టి గ్రాఫిక్స్ బాగా అనిపిస్తాయి మరియు గేమింగ్ మరింత ఆహ్లాదంగా ఉంటుంది. రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ 6GB / 8GB వేరియంట్లలో లభిస్తుంది. 

ఇక కెమేరాల విషయానికి వస్తే, రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ వెనుక  64MP+8MP+5MP+2MP గల క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇందులో 64MP ప్రధాన కెమేరా కాగా, 8MP వైడ్ యాంగిల్, 5MP మరియు 2MP  సెన్సార్లతో జతగా వస్తుంది. ఇక ముందుభాగంలో, రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమేరాని అందించింది. రెడ్మి నోట్ 9 ప్రో మ్యాక్స్ ఒక 5020mAh బ్యాటరీని, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ MIUI 11 స్కిన్ పైనఆండ్రాయిడ్ 10 తో విడుదల చేసింది.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :