శామ్సంగ్ గెలాక్సీ S9 పైన 68% భారీ డిస్కౌంట్

Updated on 19-Mar-2020
HIGHLIGHTS

ఇది QHD+ రిజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది.

శామ్సంగ్ యొక్క ప్రీమియం సిరీస్ గా పేరొందిన శామ్సంగ్ గెలాక్సీ S సిరీస్ నుండి 2018 సంవత్సరం చివరిలో గొప్ప ఫీచర్లతో లాంచ్ చేయబడిన, శామ్సంగ్ గెలాక్సీ S9 స్మార్ట్ ఫోన్ పైన Flipkart బిగ్ షాపింగ్ డేస్ నుండి 68% భారీ డిస్కౌంట్ ను అందుకుంది. ముఖ్యంగా, ఇది గొప్ప రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఇది QHD+ రిజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్, ముందుగా రూ. 62,500 ధరతో విడుదల చెయ్యబడగా, ఈ సేల్ ద్వారా కేవలం రూ.19,999 రుపాయల్ ధరకే అమ్ముడవుతోంది.

శామ్సంగ్ గెలాక్సీ నోట్ 8,  1440 x 2960 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక పెద్ద 5.8 అంగుళాల QHD + డిస్ప్లే తో ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ S9 వేగవంతమైన Exynos 9810 ఆక్టా- కోర్ ప్రాసెసర్ ద్వారా మద్దతునిస్తుంది. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ మోడళ్లలో అందుబాటులో ఉంది – 4GB / 64GB, 4GB / 128GB, మరియు 4GB / 256GB. మైక్రో SD కార్డు ద్వారా  అంతర్గత స్టోరేజిలను కూడా విస్తరించవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ S9 12MP "డ్యూయల్ ఎపర్చర్" వెనుక కెమెరాను కలిగి ఉంది, ఇది తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా మంచి చిత్రాలను తీసుకునేలా సహాయంచేస్తుంది. ఇది కెమెరా సెట్టింగులను మాన్యువల్ గా చేయటానికి అనుమతించే ఒక ప్రో మోడ్ తో వస్తుంది. ముందు, ఇది ఒక 8MP యూనిట్ కలిగి ఉంది.గెలాక్సీ S9 లో ప్రధాన అప్డేట్లలో ఒకటి దాని వెనుక కెమెరాలో చేయబడింది, డ్యూయల్ ఎపర్చరు 12MP సెన్సార్ తో వస్తుంది. వెనుక వైపున కెమెరా క్రింద వేలిముద్ర సెన్సార్ను ఉంచింది

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :