అమెజాన్ కిక్ స్టార్టర్ సేల్ నుండి Narzo 50 5G పైన భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది.!

HIGHLIGHTS

రియల్‌మీ నార్జో 50 5G స్మార్ట్ ఫోన్ ను లాంచ్ లాంచ్ సమయంలో బేసిక్ వేరియంట్ ను 15,999  రూపాయల ప్రారంభ ధరలో విడుదల చేసింది. అయితే, అమెజాన్ కిక్ స్టార్టర్ సేల్ నుండి  అన్ని వేరియంట్స్ పైన 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో పాటు SBI బ్యాంక్ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది. అంటే, అమెజాన్ కిక్ స్టార్టర్ సేల్ నుండి రియల్ మీ నార్జో 50 5G స్మార్ట్ ఫోన్ ను ఎన్నడూ చూడనంత తక్కువ ధరకే పొందవచ్చు.

Realme Narzo 50 5G : అఫర్ ధర (Buy From Here

1. Narzo 50 5G (4GB+64GB) ధర :రూ.13,999

2. Narzo 50 5G (4GB+128GB) ధర :రూ.14,999

3. Narzo 50 5G (6GB+128GB) ధర :రూ.15,999 

Realme Narzo 50 5G: స్పెక్స్

రియల్‌మీ నార్జో 50 5జి స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ డిస్ప్లే ని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది.ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన MediaTek 5G ప్రాసెసర్ డైమెన్సిటీ 810 తో పనిచేస్తుంది.నార్జో 50 5G మూడు మోడళ్లలో మరియు బ్లాక్, బ్లూ వంటి రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది.

నార్జో 50 5G ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమెరాని కలిగి వుంది. ఈ కెమెరాలలో 48MP మైన్ సెన్సార్ మరియు 2MP పోర్ట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. అలాగే, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ స్పీకర్లు మరియు డైనమిక్ ర్యామ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ 33W డార్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీని కలిగివుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :