రియల్‌మీ డేస్ సెల్ నుండి రియల్‌మీ 7 పైన భారీ డిస్కౌంట్

Updated on 31-Mar-2021
HIGHLIGHTS

రియల్‌మీ డేస్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది.

చివరి రోజు సేల్ నుండి మంచి డీల్స్ ప్రకటించింది.

రియల్‌మీ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన రియల్‌మీ డేస్ సేల్ ఈరోజుతో ముగుస్తుంది. అయితే, చివరి రోజు సేల్ నుండి మంచి డీల్స్ ప్రకటించింది. ఇందులో, రియల్‌మీ 7 స్మార్ట్ ఫోన్ డీల్ చాలా బాగుంది. Realme 7 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో గొప్ప ఫీచర్లను కలిగి వుంటుంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే, తక్కువ ధరలో  64MP Sony IMX682 క్వాడ్ కెమేరా సెటప్ ని అందిస్తుంది మరియు MediaTek Helio G95 ప్రాసెసర్ తో వచ్చిన మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే. ఈ ఫోన్ ఈరోజు ముగియనున్న రియల్‌మీ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.        

Realme 7: అఫర్ ధర

రియల్‌మీ 7 స్మార్ట్ ఫోన్ 1500 రూపాయల డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ ఫోన్ యొక్క 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ .13,499 ధరతో, 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌ రూ .15,499 ధరతో లభిస్తుంది.

Realme 7: ప్రత్యేకతలు

రియల్‌మీ 7 లో ఒక పెద్ద 6.5-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే 90Hz అధిక రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే LCD స్క్రీన్‌ను ఉపయోగిస్తుంది, అయితే అధిక రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది మరియు గొరిల్లా గ్లాస్ 3 గ్లాస్ రక్షణతో వస్తుంది.

రియల్‌మీ 7 మందం 9.4 మిల్లీమీటర్లు మరియు 196.5 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్ప్లాష్‌ ప్రూఫ్, ఎందుకంటే నీటి నుండి నష్టాన్ని నివారించడానికి సిలికాన్ సీలింగ్‌లను కలిగి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు పవర్ బటన్ కూడా ఒకటే బటన్ అవుతుంది.

రియల్‌మీ 7 ను MediaTek Helio G95 ప్రాసెసర్ ఆక్టా-కోర్ CPU  మరియు మాలి-జి 76 GPU తో కలిగి ఉంది. ఇది 6GB / 8GB RAM మరియు 64GB / 128GB స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. ఈ ఫోన్ Realme UI లో నడుస్తుంది.

Realme 7 వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ఎఫ్ / 1.8 ఎపర్చరు గల ప్రాధమిక  64MP కెమెరాతో అదికూడా Sony IMX682 సెన్సార్, 8 ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా 119-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్- వ్యూ, B&W  పోర్ట్రెయిట్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి వుంటుంది. అయితే ముందు భాగంలో మీకు ఎఫ్‌ / 2.0 ఎపర్చర్‌తో 16 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది.

రియల్‌మీ 7 లో పేద్ద 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్‌ మీకు అందుతుంది. ఈ బాక్స్ లో అందించబడిన ఈ 30W డార్ట్ ఛార్జ్ అడాప్టర్‌ను ఉపయోగించడం ద్వారా ఈ ఫోన్ 0-100% ఛార్జ్ చేయ్యుడానికి 65 నిమిషాలు పడుతుందని రియల్ మీ పేర్కొంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :