Realme Narzo 30A పైన భారీ డిస్కౌంట్

Updated on 08-Jun-2021
HIGHLIGHTS

Realme Narzo 30A పైన భారీ డిస్కౌంట్

18W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు పెద్ద 6,000mAh బ్యాటరీ ఫోన్

Realme యొక్క మూడవ వార్షికోత్సవం సందర్భంగా సేల్

ఇటీవల కేవలం బడ్జెట్ ధరలో వచ్చిన రియల్మీ నార్జో 30A స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. Realme యొక్క మూడవ వార్షికోత్సవం సందర్భంగా Flipkart నిర్వహిస్తున్న సేల్ నుండి Realme Narzo 30A పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో 18W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు పెద్ద 6,000mAh బ్యాటరీ మరియు గేమింగ్ ప్రొసెసర్ తో తీసుకొచ్చింది. ఈ రియల్మీ బడ్జెట్ ఫోన్ రూ.8,999 ప్రారంభ ధరలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క అఫర్ ధర మరియు స్పెక్స్ క్రింద చూడవచ్చు.

Realme Narzo 30A  : అఫర్ ధర

రియల్మీ నార్జో 30A 3GB + 32GB వేరియంట్ ధర :Rs. 7,999

రియల్మీ నార్జో 30A 4GB + 64GB వేరియంట్ ధర :Rs. 9,999 

అంటే, ఈ Flipkart సేల్ నుండి Realme Narzo 30A స్మార్ట్ ఫోన్ ను 1,000 రూపాయల డిస్కౌంట్ ధరకే పొందవచ్చు. అంతేకాదు, Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డుతో కొనేవారికి 10% అధనపు తగ్గింపు కూడా లభిస్తుంది.          

Realme Narzo 30A: స్పెషిఫికేషన్స్

రియల్మీ నార్జో 30A స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ గల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే మినీ డ్రాప్ నోచ్ డిజైన్ తో వుంటుంది. ఈ గరిష్టంగా 570 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. నార్జో 30A మీడియా టెక్ హీలియో G85 చిప్సెట్ తో పనిచేస్తుంది. ఇది ఆక్టా కోర్ ప్రొసెసర్ మరియు మాలి -G52 GPU తో వుంటుంది. ఈ ప్రోసిజర్ కి జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB/64GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది.

రియల్మీ నార్జో 30 A డ్యూయల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 13MP ప్రధాన కెమెరా బ్లాక్ & వైట్ సెన్సార్ లను కలిగివుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని అందించారు. ఈ ఫోన్, అన్లాక్ ఫీచర్లుగా ఫేస్ అన్లాక్ మరియు బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. ఈ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి వుంది. ఈ రియల్మీ నార్జో 30A పెద్ద 6,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. ఈ ఫోన్, లేజర్ బ్లూ మరియు లేజర్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :