HTC యొక్క చౌకైన మూడు కెమేరాల ఫోన్ Wild Fire X ఓపెన్ సేల్

Updated on 26-Aug-2019
HIGHLIGHTS

హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఎక్స్‌లో “మైబడ్డీ ” ఫీచర్ వస్తుంది

భారతదేశంలో HTC  తన పునరాగమనాన్ని సూచిస్తూ, HTC వైల్డ్‌ఫైర్ ఎక్స్ ని, ఆగస్టు 22 న మొదటి సేల్ జరుగగా, ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు ఓపెన్ సేల్ ద్వారా అందుబాటులో ఉంది . ఈ ఫోన్ ఆగస్టు 14 న ఇనోన్ స్మార్ట్ టెక్నాలజీ లాంచ్ చేసింది, దీనికి హెచ్‌టిసి బ్రాండ్‌ లైసెన్స్ ఇచ్చింది. హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఎక్స్‌లో “మైబడ్డీ ” ఫీచర్ వస్తుంది, ఇది ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌ను వ్యక్తిగత భద్రతా సాధనంగా ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది.

HTC వైల్డ్‌ఫైర్ ఎక్స్ ధర మరియు ఆఫర్‌లు

హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఎక్స్ బేస్ వేరియంట్ అయిన, 3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్‌ కేవలం రూ .10,999 వద్ద ప్రారంభమవుతుంది మరియు 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మోడల్‌ రూ .13,999 ధరతో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సఫైర్ బ్లూ కలర్‌లో అందుబాటులోఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో లాంచ్ ఆఫర్‌లలో భాగంగా, వోడాఫోన్ మరియు ఐడియా కస్టమర్లకు రూ.3,750 రూపాయల, ఈ పైకాన్ని యాభై కూపన్లు రూ .75 వోచర్ల రూపంలో అందించబడతాయి అలాగే రోజుకు అదనంగా 500 MB డేటా 18 నెలలకు గాను అందుకుంటారు. , ఇవి మైవోడాఫోన్ లేదా మై ఐడియా యాప్ ద్వారా రూ .255 తో రీఛార్జ్ చేసిన తర్వాత మాత్రమే లభిస్తాయి.

HTC వైల్డ్‌ఫైర్ X లక్షణాలు

హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఎక్స్‌లో ఒక 6.20-అంగుళాల IPS డిస్‌ప్లేను 1520 x 720 పిక్సెల్‌ల వద్ద వాటర్‌డ్రాప్ నాచ్‌తో అందించింది. ఇది 4 జిబి ర్యామ్‌తో జతచేయబడిన హీలియో పి 22 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3,300 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి, ఆండ్రాయిడ్ 9 OS పైన పనిచేస్తుంది.

ఇక కెమెరా విభాగంలో, హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఎక్స్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను 12MP ప్రధాన కెమెరా + 8 MP లెన్స్‌తో (2 X ఆప్టికల్ జూమ్) + 5 MP డెప్త్ సెన్సార్ కలిగి ఉంది. ముందు భాగంలో, ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఒక 8 MP సెల్ఫీ కెమెరాను వాటర్‌డ్రాప్ నోచ్ లో ఇచ్చారు.

పెద్దగా అలారంను మోగించి, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు ఫోన్ యొక్క ప్రత్యక్ష స్థాన సమాచారాన్ని పంపడానికి మరియు సమీపంలోని  ఆడియో / వీడియోను రియల్ టైంలో రికార్డ్ చేయడానికి మరియు ప్రసారం చేయడానికి వినియోగదారులను షెల్ నుండి ఉపసంహరించుకునేలా చేసే “మైబుడ్డీ” సేఫ్టీ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :