Honor x9c 5G: అన్ బ్రేకబుల్ డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన హానర్.!

Updated on 07-Jul-2025
HIGHLIGHTS

హానర్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది

Honor x9c 5G ను అన్ బ్రేకబుల్ డిజైన్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి సేల్ అవుతుంది

Honor x9c 5G: హానర్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను అన్ బ్రేకబుల్ డిజైన్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ భారీ బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్స్ తో ఆకట్టుకునేలా భారత మార్కెట్లో హానర్ అందించింది. హానర్ సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఫోన్ ధర, ఫీచర్లు మరియు ఆఫర్స్ ఏమిటో చూద్దామా.

Honor x9c 5G: ప్రైస్

హానర్ x9c 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 21,999 రూపాయల ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో అందుకునేలా భారీ లాంచ్ ఆఫర్స్ మరియు డీల్స్ అందించింది. జూలై 12వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి సేల్ అవుతుంది.

ఆఫర్లు

హానర్ x9c 5జి స్మార్ట్ ఫోన్ పై ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ రూ. 750 డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ పై రూ. 1,099 విలువైన వన్ ఇయర్ అదనపు వారంటీ ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ. 7,500 రూపాయల వరకు అదనపు ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా అందించింది. ఇవి కాకుండా No Cost EMI మరియు రూ. 1,250 రూపాయల విలువైన అదనపు తగ్గింపు ఆఫర్ కూడా ప్రకటించింది.

Honor x9c 5G: ఫీచర్స్

హానర్ x9c 5జి స్మార్ట్ ఫోన్ 7.98 mm మందంతో స్లీక్ గా మరియు 189g చాలా తేలికగా ఉంటుంది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. హానర్ ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 6 Gen 1 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. దానికి జతగా 12 జీబీ ర్యామ్ మరియు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది.

ఈ హానర్ ఫోన్ 108MP మెయిన్ సెన్సార్ మరియు 5MP వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా అందించింది. ఈ ఫోన్ 4K వీడియో షూట్ సపోర్ట్ తో పాటు చాలా AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6600 mAh బిగ్ బ్యాటరీ మరియు 66W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇవి కాకుండా మంచి సౌండ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఈ ఫోన్ లో హానర్ అందించింది.

Also Read: Prime Day Sale 2025 బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ రివీల్ చేసిన అమెజాన్.!

ఈ ఫోన్ 2 మీటర్ డ్రాప్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. అంటే, ఈ ఫోన్ క్రింద పడినా పగలని విధంగా గట్టిగా ఉంటుంది. ఆలాగే, IP 65M వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. అందుకే ఈ ఫోన్ ను అన్ బ్రేకబుల్ స్మార్ట్ ఫోన్ అని కంపెనీ గొప్పగా చెబుతోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :