Honor X7c india launch date conformed
Honor X7c స్మార్ట్ ఫోన్ కోసం నిన్నటి వరకు కేవలం ఫీచర్స్ తో మాత్రమే టీజింగ్ చేసిన హానర్, ఈరోజు ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది, కేవలం లాంచ్ డేట్ మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్స్ సైతం వెల్లడించింది. ఈ ఫోన్ SGS డ్రాప్ రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్ మరియు బిగ్ స్టోరేజ్ వంటి ఆకట్టుకునే మరిన్ని ఫీచర్స్ తో భారత మార్కెట్ లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది.
హానర్ ఎక్స్ 7c స్మార్ట్ ఫోన్ ఆగస్టు 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇండియాలో విడుదల చేయబడుతుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి ప్రత్యేకంగా టీజింగ్ చేయబడుతోంది. అంటే, ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ ను ఫారెస్ట్ గ్రీన్ మరియు మూన్ లైట్ అనే రెండు రంగుల్లో లాంచ్ చేస్తున్నట్లు హానర్ అఫీషియల్ గా ప్రకటించింది.
హానర్ ఎక్స్ 7c స్మార్ట్ ఫోన్ వివరాలు కూడా హానర్ అందించింది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు సరికొత్త లెథర్ బ్యాక్ ప్యానల్ డిజైన్ తో ఆకట్టుకునేలా ఉంటుంది. ఇది కొత్త గ్రీన్ కలర్ లో చూడముచ్చటగా కనిపిస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు 300% హై వాల్యూమ్ మోడ్ తో కూడా వస్తుంది. ఇందులో హానర్ క్యాప్సూల్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ తో వస్తుంది.
Also Read: Realme P4 Pro Price: భారీ ఫీచర్స్ తో వస్తున్న ఈ ఫోన్ ధర తెలుసుకోండి.!
ఈ హానర్ కొత్త స్మార్ట్ ఫోన్ తక్కువ అంచులు కలిగిన డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, మంచి 850 నిట్స్ బ్రైట్నెస్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఇది లైట్ తక్కువగా ఉండే సమయాల్లో తక్కువలో తక్కువ 2 నిట్స్ బ్రైట్నెస్ వరకు పడిపోతుంది.