Honor 200 Lite 5G announced with spotlight 50mp selfie camera
Honor 200 Lite 5G: హానర్ 200 సిరీస్ నుంచి హానర్ 200 మరియు 200 Pro స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన హానర్, ఇప్పుడు హానర్ 200 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ను అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను పవర్ ఫుల్ 50MP సెల్ఫీ కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు హానర్ టీజింగ్ చేస్తోంది.
హానర్ 200 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్ లో లాంచ్ చేస్తునట్లు హానర్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది.
హానర్ 200 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ రౌండ్ కార్నర్ మరియు క్లీన్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ 6.78mm చాలా సన్నగా మరియు 166 గ్రాముల బరువుతో ఉంటుందట. ఈ ఫోన్ చూడటానికి చాలా స్లీక్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వుంది. ఈ ఫోన్ ను స్టారి బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ మరియు సియాన్ లేక్ రెండు కలర్ లలో లాంచ్ చేస్తుంది.
ఈ ఫోన్ ను 3240Hz PWM డిమ్మింగ్ కలిగిన AMOLED స్క్రీన్ తో లాంచ్ చేయనున్నట్లు కూడా హానర్ ప్రకటించింది. ఈ ఫోన్ కెమెరా గురించి ప్రత్యేకంగా చెబుతోంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఇందులో 108MP మెయిన్ కెమెరా, మ్యాక్రో కెమెరా మరియు వైడ్ అండ్ డెప్త్ కెమెరాలు ఉన్నాయి.
Also Read: Flipkart The Big Billion Days Sale కంటే ముందే భారీ Smart Tv ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!
ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరాని కలిగి వుంది మరియు ఇందులో స్పాట్ లైట్ ని కలిగి ఉంటుంది. అంటే, సెల్ఫీ కెమెరాతో ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది. ఈ సెల్ఫీ కెమెరాతో గొప్ప పోర్ట్రైట్ లు మరియు మెయిన్ కెమెరాతో గొప్ప ఫోటోలు మరియు వీడియోలు కూడా పొందవచ్చని హానర్ తెలిపింది.