Nokia 3.4: భారతదేశంలో విడుదలకు సిద్దమవుతున్న నోకియా స్మార్ట్ ఫోన్

Updated on 03-Feb-2021
HIGHLIGHTS

నోకియా 3.4 స్మార్ట్ ఫోన్ త్వరలో ఇండియాలో రిలీజ్ అవ్వనుంది.

నోకియా 2.4 ఇప్పటికే భారతదేశంలో రూ .10,399 ధరతో విడుదల చెయ్యబడింది.

Nokia 3.4 మల్టి స్టోరేజ్ అప్షన్ లతో తీసుకురావచ్చని భావిస్తున్నారు.

నోకియా 3.4 స్మార్ట్ ఫోన్ ను త్వరలో ఇండియాలో రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ టీజ్ చేస్తోంది. వాస్తవానికి, గతంలో డిసెంబర్ చివరి నాటికి భారతదేశంలో ప్రారంభించబడుతుందని చాలా రూమర్లు వచ్చాయి. కానీ, ఇప్పటి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, సంస్థ ఇప్పుడు ఈ నోకియా 3.4 ఇండియా లాంచ్ గురించి వెల్లడించింది.

ఇప్పటికే, ప్రపంచ వ్యాప్తంగా నోకియా 3.4 మరియు నోకియా 2.4 తో పాటుగా లాంచ్ చేశారు. వీటిలో, నోకియా 2.4 ఇప్పటికే భారతదేశంలో రూ .10,399 ధరతో విడుదల చెయ్యబడింది. ఇదే క్రమంలో, నోకియా 3.4 ధర కూడా 10,000 రూపాయల కంటే పైనే ఉండడమే కాకుండా, ఎంచుకోవడానికి మల్టి స్టోరేజ్ అప్షన్ లతో  తీసుకురావచ్చని భావిస్తున్నారు.

Nokia 3.4 స్పెషిఫికేషన్లు

నోకియా 3.4 ఒక 6.3-అంగుళాల HD + రిజల్యూషన్ డిస్ప్లేను పంచ్ హోల్ డిజైనుతో కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 460 ఆక్టా-కోర్ ప్రాసెసర్  కి జతగా 4GB RAM మరియు 64GB స్టోరేజ్ తో జత చేయబడింది. స్టోరేజ్ ను మరింతగా పెంచడానికి వీలుగా, మైక్రో SD కార్డ్ ఉపయోగించి 512GB వరకు స్టోరేజ్ ను విస్తరించే వీలుంది. ఇది ఆండ్రాయిడ్ 10 తో వస్తుంది మరియు త్వరలోనే ఆండ్రాయిడ్ 11 అప్డేట్ ను కూడా అందుకుంటుంది.

నోకియా 3.4 వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది, ఇందులో ప్రాధమిక 13 ఎంపి కెమెరా, 5 ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2 ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. పంచ్-హోల్ కటౌట్ లోపల 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్ ఫోనులో 4,000 mAh  బ్యాటరీని 10W సాధారణ స్పీడ్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :