నోకియా 5 కెమేరాల ఫోనుపైన 15,000 రూపాయల భారీ డిస్కౌంట్

Updated on 25-Feb-2020
HIGHLIGHTS

నోకియా ప్రేమికులకు నిజంగా గొప్ప వరం

గత సంవత్సరం, అందరికంటే ఎక్కువ కెమెరాలతో ఓక్ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసిన ఘనత మాత్రం నోకియా కె దక్కుతుంది.  నోకియా తన ఫ్లాగ్ షిప్ కెమేరా బీస్ట్ అయినటువంటి, నోకియా 9 ప్యూర్ వ్యూ ని వెనుక పెంటా (5) కెమేరాలతో తీసుకొచ్చింది. అంతేకాదు, నోకియా 9 ప్యూర్ వ్యూ ఒక 5 కెమేరాల సెట్ గా రావడం మరియు ఈ 5 కెమెరాలన్నీ కూడా ఒకేసారి పనిచేసేలా అందించిన పనితీరు అందరిని ఆకట్టుకుంది.

అయితే, ఈ స్మార్ట్ ఫోన్ను రూ.49,999 రూపాయల ధరతో ప్రకటించడం తో మిడ్ రేంజ్ వినియోగదారులకు ఇది కొంచం మింగుడు పడనీ విషయంగా మారింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ పైన HMD గ్లోబల్ భారీ తగ్గిపును ప్రకటించడంతో నోకియా ప్రేమికులకు నిజంగా గొప్ప వరంగా మారింది. ఇందులో అంత గొప్పగా చెప్పడానికి ఏముందని అనుకుంటున్నారో ఏమో? ఒక వెయ్యి రూపాయలో, రెండు వేలో అయితే అంతా నొక్కి చెప్పాల్సిన అవసరంలేదు, కానీ దీని పైన ఏకంగా 15,000 రూపాయల ధర తగ్గింపు ప్రకటించింది కాబట్టే నొక్కి మరి చెప్పాల్సి వస్తుంది.             

ఈ స్మార్ట్ ఫోన్ కేవలం కెమేరాల పరంగా మాత్రమే కాకుండా QHD+ POLED డిస్ప్లేతో మంచి వీక్షణానుభూతిని అందిస్తుంది.  నోకియా 9 ప్యూర్ వ్యూ, HDR10 మద్దతుతో పాటు QHD+ రిజల్యూషన్ తో ఒక 5.99-అంగుళాల POLED డిస్ప్లేతో ఉంటుంది. ఈ ఫోన్, హుడ్ కింద ఒక స్నాప్డ్రాగన్ 845 SoC తో ఉంటుంది. ఈ చిప్సెట్ 6GB RAM మరియు 128GB స్టోరేజి తో జత చేయబడుతుంది.

నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్ ఫోన్ Android 9 Pie తో అమలవుతుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ కోసం మద్దతునిచ్చే ఒక పెద్ద 3,320mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఒక ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది మరియు IP67 ద్రువీకరణతో వస్తుంది కాబట్టి నీరు మరియు డస్ట్ ప్రూఫ్ కూడా ఇందులో ఉంటుంది.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :