రెడ్మి నోట్ 7 ప్రో స్పెక్స్ ఇవిగో : TENAA లిస్టింగులో వివరాల వెల్లడి.
ఈ స్మార్ట్ ఫోన్, 3900 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 6.3 అంగుళాల డిస్ప్లేతో హ్యాండ్సెట్ TENAA జాబితాలో ఉంది.
రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోన్ను షావోమి ఈ వారంలో ప్రకటించనుంది. ఈ వారంలో అధికారికంగా విడుదల చేయడానికి సిద్ధంకాగా, ప్రస్తుతం ఈ హ్యాండ్సెట్ TENAA వెబ్సైట్లో కనిపించింది. NashvilleChatterClass ద్వారా, రెడ్మి నోట్ 7 ప్రో యొక్క డిజైన్ గురించిన ఒక జంట చిత్రాలతో పాటుగా, ఒక మోడల్ సంఖ్య M1901F7BE సర్టిఫికేషన్ తో ఈ వెబ్సైట్లో జాబితా చేయబడింది మరియు దాని యొక్క కొన్ని ఫీచర్లు ఈ వెబ్ సైట్ లో జాబితా చేయబడతాయి. రెడ్మి నోట్ 7 ప్రో 59.21 x 75.21 x 8.1 మిమీ కొలతలతో మరియు 3900 mAh బ్యాటరీతో ఒక 6.3 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉండవచ్చని ఈ లిస్టింగ్ సూచిస్తోంది. రెడ్మినోట్ 7 ప్రో యొక్క కొలతలు, స్క్రీన్ పరిమాణం మరియు బ్యాటరీ సామర్థ్యం అన్నికూడా, రెడ్మి నోట్ 7 వలనే ఉంటుంది.
Surveyఇది ఈ ఫోన్ యొక్క నిజమైన చిత్రం అయినట్లయితే, అది కూడా రెడ్మినోట్ 7 కి సమానంగా కనిపిస్తుంటుంది. ఈ చిత్రాల ప్రకారం, Redmi Note 7 Pro కూడా డ్యూయల్ -వెనుక కెమెరాలు మరియు వెనుక వేలిముద్ర సెన్సారుతో సెటప్ చేయబడుతుంది. అలాగే, వేనుక ప్యానెల్లో ఒక గ్రేడియంట్ ఫినిష్ కూడా కనిపిస్తుంది. రెడ్మి నోట్ 7 ప్రో ఇప్పటికే ఒక 48MP సోనీ IMX586 సెన్సార్ కలిగి రానున్నట్లు ధ్రువీకరించబడింది మరియు 6GB RAMతో ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. రెడ్మి CEO, లూ వెయిబింగ్, ఇటీవల ఈ స్మార్ట్ ఫోన్ను 2,000 యువాన్లకు (21,222 రూపాయల కన్నా తక్కువ ధరకే) అందించవచ్చని సూచనప్రాయంగా తెలిపారు. ఒకవేళ ఇదేగనుక నిజమైతే, ప్రస్తుతం ఉన్నవాటిలో అత్యంత ఖరీదైన రెడ్మి ఫోనుగా ఇది ఉంటుంది.
Redmi Note 7 Pro గురించి మునుపటి నివేదికలు, ఇది Snapdragon 675 SoC ద్వారా ఆధారితంగా ఉంటుందని సూచిస్తున్నాయి. ఈ ఫోన్ త్వరలోనే విడుదల చేయబడుతుంది మరియు ఫిబ్రవరి 28 న భారతదేశంలో ఒక లాంచ్ ఈవెంట్ జరపనుంది, ఇది రెడ్మి నోట్ 7 ను ప్రకటించడం కోసమని ఇప్పటికే ధ్రువీకరించింది. అయితే, రెడ్మి నోట్ 7 ప్రో మరియు రెడ్మి గో స్మార్ట్ ఫోన్లను కూడా అదే రోజున ప్రకటిస్తుందో లేక దాటవేస్తుందో అనే సమాచారం లేదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile