Google Pixel 9 big deal announced from flipkart BBD sale 2025
2025 పండుగ సీజన్ కోసం ఫ్లిప్ కార్ట్ తీసుకొచ్చిన అతిపెద్ద సేల్ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అందించనున్న బెస్ట్ డీల్స్ ప్రకటించింది. వీటిలో గూగుల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై అందించిన బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అమితంగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, Google Pixel 9 స్మార్ట్ ఫోన్ 2025 పండుగ సేల్ నుండి సగం ధరకే లభిస్తుంది. ఈ బిగ్ డీల్ ని ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు రివీల్ చేసింది మరియు ఈ డీల్ సోమవారం నుంచి లభిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ 2025 మార్చి నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 79,999 ధరలో విడుదల చేయబడింది. అయితే, ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 నుంచి కేవలం 34,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ విషయాన్ని నేను చెప్పడం లేదు ఫ్లిప్కార్ట్ ఈ ఫోన్ ప్రైస్ తో గొప్పగా టీజింగ్ చేసింది కూడా. అంటే, ఫ్లిప్ కార్ట్ పండుగ సేల్ నుంచి ఈ గూగుల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సగం కంటే తక్కువ ధరలో లభించే అవకాశం ఉంటుంది.
Also Read: iPhone 14 Price Cut: 37 వేల భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న ఐఫోన్ 14.!
గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ 6.3 ఇంచ్ ఆక్టువా OLED స్క్రీన్ ని FHD+ (2424 x 1080) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60 Hz – 120 Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ నానో మరియు eSIM సపోర్ట్ తో వస్తుంది. ఈ గూగుల్ ఫోన్ Tensor G4 తో పని చేస్తుంది మరియు 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ గూగుల్ ఫోన్ 50MP + 48MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 10.5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, సూపర్ రిజల్యూషన్ జూమ్ గూగుల్ యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ తో పాటు గూగుల్ AI సపోర్ట్ ఓ కూడా వస్తుంది. గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ 4700 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Built-in AI సపోర్ట్ తో మంచి AI సపోర్ట్ అందిస్తుంది. ఈ ఫోన్ గొప్ప పెర్ఫార్మెన్స్ మరియు జబర్దస్త్ కెమెరా ఫీచర్స్ కలిగిన ఫోన్ గా చెప్పడుతుంది.