Google Pixel 8a got huge discount after pixel 9a sale started
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 9a రాకతో పిక్సెల్ 8a ఫోన్ రేటు భారీగా తగ్గింది. గత సంవత్సరం మే నెలలో విడుదలైన పిక్సెల్ 8a ఫోన్ ఇప్పుడు సంవత్సరం గడిచే సరికి దాదాపు 18 వేల రూపాయల డిస్కౌంట్ తో లభిస్తోంది. అయితే, ఇప్పుడు చెప్పిన డిస్కౌంట్ లో ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేశామని గమనించాలి
గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 52,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు Flipkart నుంచి 28% భారీ డిస్కౌంట్ తో రూ. 37,999 ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో తీసుకునే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో ఈ గూగుల్ ఫోన్ ను కేవలం రూ. 34,999 రూపాయల ధరకే పొందవచ్చు.
Also Read: Lava Agni 3 5G డ్యూయల్ స్క్రీన్ ఫోన్ పై రూ. 4,250 భారీ డిస్కౌంట్ అందుకోండి.!
గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ మరియు ప్రీమియం డిజైన్ తో ఆకట్టుకుంటుంది. కెమెరా ఫోన్ లకు పెట్టింది పేరైన గూగుల్ పిక్సెల్ సిరీస్ ఫోన్ లలో ఇటీవల విడుదలైన ఫోన్ ఇది మరియు ఈ ఫోన్ కూడా గొప్ప కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 64MP మెయిన్ కెమెరా + 13MP రెండవ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరాతో పాటు 13MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియోలను 30fps మరియు 60fps వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మ్యాజిక్ ఎడిటర్, Live HDR+, అల్ట్రా HDR మరియు మరిన్ని బెస్ట్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ గూగుల్ Tensor G3 చిప్ సెట్ మరియు సెక్యూరిటీ కోసం Titan M2 సెక్యూరిటీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీతో గూగుల్ అందించింది. ఈ ఫోన్ 6.1 ఇంచ్ ఆక్టువ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇందు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4404 mAh బ్యాటరీ మరియు వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.