Google Pixel 7a స్మార్ట్ ఫోన్ పైన Flipkart Sale బిగ్ డీల్.!
Google Pixel 7a స్మార్ట్ ఫోన్ ను కొనాలని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్
గూగుల్ పిక్సెల్ 7a ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి మీ బడ్జెట్ ధరలో అందుకునే ఛాన్స్
అద్భుతమైన కెమేరా కలిగిన స్మార్ట్ ఫోన్
Google Pixel 7a స్మార్ట్ ఫోన్ ను కొనాలని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. Flipkart పండుగ Sale ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. అద్భుతమైన కెమేరా కలిగిన స్మార్ట్ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి మీ బడ్జెట్ ధరలో అందుకునే ఛాన్స్ వుంది. మరింకెందుకు ఆలశ్యం ఫ్లిప్ కార్ట్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్ పైన ఒక లుకేద్దామా.
SurveyFlipkart Sale offer on Google Pixel 7a
ఇండియన్ మార్కెట్ లో రూ.41,999 రూపాయల ధరతో అడుగుపెట్టిన గూగుల్ పిక్సెల్ 7ఎ స్మార్ట్ ఫోన్, ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో రూ. 35,999 అఫర్ ధరకే ఈరోజు లభిస్తోంది. ఈ గూగుల్ ఫోన్ ను Kotak, ICICI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Also Read : Dolby 5.1 సౌండ్ బార్ పైన Amazon GIF Sale జబర్దస్త్ ఆఫర్.!
గూగుల్ పిక్సెల్ 7ఎ ప్రత్యేకతలు
గూగుల్ పిక్సెల్ 7ఎ స్మార్ట్ ఫోన్ 6.1 ఇంచ్ 24 Bit ప్యానల్ తో వస్తుంది మరియు 90 Hz రిఫ్రెష్ రేట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్Google యొక్క Tensor G2 ప్రోసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 8 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ (Nano + eSIM) సపోర్ట్ కూడా వస్తుంది.

ఈ గూగుల్ ఫోన్ లో వెనుక 64MP (OIS) + 13MP డ్యూయల్ రియర్ కెమేరాని Super Res Zoom, Real Tone, Magic Eraser వంటి టన్నుల కొద్ధి కెమేరా ఫీచర్ లను అందించింది. అలాగే, ఈ ఫోన్ IP67 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ లో Titan M2 Security Chip Live Translate, Clear Calling మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile