Flipkart సేల్ నుండి Google లేటెస్ట్ 5G ఫోన్ పైన 14 వేల భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

Google లేటెస్ట్ 5G ఫోన్ పైన Flipkart బిగ్ డీల్

ముందెన్నడూ చూడనంత అతితక్కువ ధరకే ఈ Google స్మార్ట్ ఫోన్ అమ్ముడవుతోంది

ఫ్లిప్ కార్ట్ అఫర్ చేస్తున్న డిస్కౌంట్ మరియు డీల్ గురించి తెలుసుకోండి

Google లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పైన Flipkart తన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి 14 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందించింది. గూగుల్ ఇటీవల ఇండియాలో లాంచ్ చేసిన Google Pixel 6a ఫ్లిప్ కార్ట్ నిగ సేవింగ్ డేస్ నుండి 14 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. క్లియర్ గా చెప్పాలంటే, ముందెన్నడూ చూడనంత అతితక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్ అమ్ముడవుతోంది. గూగుల్ పిక్సెల్ 6a పైన ఫ్లిప్ కార్ట్ అఫర్ చేస్తున్న డిస్కౌంట్ మరియు డీల్ గురించి తెలుసుకోండి.    

Google Pixel 6a: ధర మరియు ఆఫర్లు

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్ ఫోన్ రూ.43,999 ధరతో ఫ్లిప్‌కార్ట్ నుండి లాంచ్ చేయబడింది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 14,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.29,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అదనంగా, Citi మరియు ICICI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించి ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి  10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

Google Pixel 6a: స్పెక్స్

గూగుల్ పిక్సెల్ 6ఎ స్మార్ట్ ఫోన్ 6.14-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది OLED ప్యానెల్‌. ఈ డిస్ప్లే ఎగువ మధ్యలో పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. పిక్సెల్ 6 ఎ స్మార్ట్ ఫోన్ Google టెన్సర్ యొక్క శక్తితో నడుస్తుంది. ఇఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది.

గూగుల్ పిక్సెల్ 4 ఎ, డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 12.2 MP డ్యూయల్ పిక్సెల్ వైడ్ కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరాలతో వస్తుంది. ఈ కెమెరాలు OIS మరియు EIS లకు కూడా సపోర్ట్ కలిగి ఉంటాయి. పిక్సెల్ 6 ఎ యొక్క కెమెరా Live HDR+, సినీమ్యాటిక్ పాన్, డ్యూయల్ ఎక్స్ పోజర్ కంట్రోల్స్, వంటి చాలా ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ వెనుక కెమెరాతో 30Kps/60Kps వద్ద 4K, 30/60fps వద్ద 1080p మరియు 240fps వరకు 720p రికార్డ్ చేయగలదు. ఇందులో 8MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి వుంది.

Pixel 6 a ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,410 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి వుంది. అలాగే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు IP67 వాటర్ ప్రొటక్షన్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :