Google Pixel 10: భారీ ఆఫర్స్ తో మొదలైన గూగుల్ కొత్త ఫోన్ సేల్.!

Updated on 27-Aug-2025
HIGHLIGHTS

Google Pixel 10 స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది

భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను మీరు తక్కువ ధరలో అందుకోవచ్చు

సూపర్ కెమెరా మరియు లేటెస్ట్ చిప్ సెట్ తో వచ్చిన గూగుల్ కొత్త ఫోన్ పై బిగ్ డీల్స్ అందుకోండి

Google Pixel 10 స్మార్ట్ ఫోన్ భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా గూగుల్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను మీరు తక్కువ ధరలో అందుకోవచ్చు. సూపర్ కెమెరా మరియు లేటెస్ట్ చిప్ సెట్ తో వచ్చిన గూగుల్ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర, ఆఫర్స్ మరియు ఫీచర్స్ కంప్లీట్ గా తెలుసుకోండి.

Google Pixel 10: ప్రైస్ అండ్ ఆఫర్స్

గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ రూ. 79,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఇండిగో, ఫ్రాస్ట్, లెమన్ గ్రాస్ మరియు ఒడిసియన్ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఈ గూగుల్ కొత్త ఫోన్ ఫ్లిప్‌కార్ట్ మరియు గూగుల్ అఫీషియల్ ఆన్లైన్ స్టోర్ నుంచి లభిస్తుంది.

ఆఫర్స్ :

ఈ ఫోన్ పై అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ మరియు జబర్దస్త్ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో తీసుకున్న వారికి రూ. 7,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 67,999 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.

Google Pixel 10: ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ జబర్దస్త్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 48MP క్వాడ్ PD మెయిన్, 13MP అల్ట్రా వైడ్ మరియు 10.8MP డ్యూయల్ PD టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 10.5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5X ఆప్టికల్ జూమ్, 60FPS 4K వీడియో షూట్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్స్ తో పాటు గూగుల్ పిక్సెల్ యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫిల్టర్లు మరియు ఫీచర్లు కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ క్వాడ్ HD రిజల్యూషన్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కలిగిన 6.3 ఇంచ్ OLED ఆక్టువా స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గూగుల్ లేటెస్ట్ చిప్ సెట్ Tensor G5 తో జతగా Titan M2 security కో ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Also Read: సూపర్ సౌండ్ మరియు బిగ్ స్క్రీన్ తో వచ్చిన బ్లౌపంక్ట్ కొత్త Mini LED Smart Tv ఫస్ట్ సేల్.!

ఈ పిక్సెల్ 10 ఫోన్ జెమినీ నానో, జెమినీ లైవ్ మరియు సర్కిల్ టు సెర్చ్ వంటి మరిన్ని Ai ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ పిక్సెల్ 10 ఫోన్ ఎమెర్జెన్సీ SOS, క్రైసిస్ అలర్ట్, కార్ క్రాష్ డిటెక్షన్, థెఫ్ట్ ప్రొటెక్షన్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4970 mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో పాటు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS తో వస్తుంది మరియు 7 సంవత్సరాల అప్డేట్స్ అందుకుంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :