google pixel 10 price specs and features
గూగుల్ ఈరోజు పిక్సెల్ 10 సిరీస్ వరల్డ్ వైడ్ గా విడుదల చేసింది. ఇండియాలో కూడా ఫోన్ ను లాంచ్ చేసింది. ఇందులో బేసిక్ ఫోన్ అయిన Google Pixel 10 స్మార్ట్ ఫోన్ ను ఆల్ న్యూ టెలిఫోటో లెన్స్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ గూగుల్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందామా.
గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ ను 60 – 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్టెడ్ 6.3 ఇంచ్ ఆక్టువా OLED స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది 24బిట్ డెప్త్ స్క్రీన్ మరియు గరిష్టంగా 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను గూగుల్ యొక్క లేటెస్ట్ చిప్ సెట్ గూగుల్ Tensor G5 తో అందించింది. ఈ ఫోన్ లో కూడా Titan M2 security కో ప్రోసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ లో 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. ఈ గూగుల్ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో నడుస్తుంది.
గూగుల్ ఈ ఫోన్ కెమెరా మరింత పవర్ ఫుల్ గా ఉండేలా డిజైన్ చేసింది. ఈ ఫోన్ లో మ్యాక్రో ఫోకస్ మరియు వైడ్ సపోర్ట్ కలిగిన 48MP మెయిన్, 13MP అల్ట్రా వైడ్ మరియు 20x సూపర్ జూమ్ కలిగిన 10.8MP (5x టెలిఫోటో) సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా అందించింది. ఈ ఫోన్ లో 10.5MP డ్యూయల్ PD సెల్ఫీ కెమెరా కూడా అందించింది. ఈ ఫోన్ లో Camera Coach, యాడ్ మీ, నైట్ షాట్, ఆస్ట్రోగ్రఫీ వంటి టన్నుల కొద్ది గూగుల్ కెమెరా ఫీచర్స్ తో పాటు పిక్సెల్ స్టూడియో తో మరియు 60FPS వద్ద స్టేబుల్ 4K వీడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 10-bit HDR వీడియో, సినిమాటిక్ బ్లర్, ఆడియో మ్యాజిక్ ఎరేజర్ మరియు మ్యాక్రో ఫోకస్ వీడియో వంటి వీడియో ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ బిల్ట్ Gemini Nano తో వస్తుంది మరియు AI పర్సనల్ అసిస్టెంట్ గా ఈ ఫోన్ ను రెడీగా ఉంచుతుంది. పిక్సెల్ 10 ఫోన్ కొద ఎమర్జెన్సీ SOS, క్రైసిస్ అలర్ట్, కార్ క్రాష్ డిటెక్షన్ వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4970 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు 30W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Lava Play Ultra 5G బడ్జెట్ ధరలో గేమింగ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ ను కేవలం 12 జీబీ + 256 జీబీ సింగిల్ వేరియంట్ తో రూ. 79,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ పై రూ. 7,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ను అందించింది. ఈరోజు నుంచి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ ను గూగుల్ ప్రారంభించింది. గూగుల్ స్టోర్ మరియు ఫ్లిప్ కార్ట్ మునుంచి ఈ ఫోన్ ను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.