రియల్మీ వినియోగదారులకు శుభవార్త : ఈ Realme ఫోన్లకు త్వరలో అందనున్నVoWiFi కాలింగ్ ఫీచర్

Updated on 24-Jan-2020
HIGHLIGHTS

ఈ VoWiFi ఫీచర్ యొక్క షెడ్యూల్ ని ట్వీట్ చేశారు

పెరిగిన టెలికం ధరల నుండి వినియోగదారులకు ఊరటనిచ్చేందుకు, ముందుగా జియో మరియు ఎయిర్టెల్ తీసుకొచ్చినటువంటి, ఉచిత wifi కాలింగ్ ఇప్పటికే లక్షల కొద్దీ వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ సౌకర్యంతో పనిచేసే ఫోన్లు కొన్ని మాత్రమే మర్కెట్లో వున్నాయి. ఆశ్చర్యకరంగా, ఇండియన్ మార్కెట్లో మంచి దూకుడుతో సాగిపోతున్న Realme యొక్క స్మార్ట్ ఫోన్లు ఈ జాబితాలో లేకపోవడంతో రియల్మీ వినియోగదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు రియల్మీ యొక్క CEO అయినటువంటి మాధవ్ సేథ్, రియల్మీ వినియోగదారులకు తీపికబురును అందించారు.

రియల్మీ యొక్క అధికారిక ట్విట్టర్ పేజీలో రియల్మీ ఫోన్లకు అందనున్న ఈ VoWiFi ఫీచర్ యొక్క షెడ్యూల్ ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రకారం, రియల్మీ యొక్క 17 ఫోన్లకు ఈ Vowifi కాలింగ్ ఫీచర్ అతిత్వరలో అందనుంది. అయితే, అన్నింటికంటే ముందుగా రియల్మీ యొక్క Realme X2 స్మార్ట్ ఫోనుకు ఇదే నెలలో ఈ ఫీచర్ అందుతుంది. ఇక మిగిలిన ఫోన్ల విషయానికి వస్తే, ఫిబ్రవరి నెలలో 8 ఫోన్లకు ఈ ఫీచర్ అందుతుంది మరియు మార్చి చివరికల్లా మిగిలి 8 స్మార్ట్ ఫోన్లలో  ఈ VoWiFi కాలింగ్ ఫీచర్ అప్డేట్ అందుతుంది.

VoWiFi ఫీచర్ అందుకోనున్న Realme ఫోన్ల లిస్ట్

1. జనవరి : Realme X2 Pro 

3. ఫిబ్రవరి  : రియల్మీ 5, రియల్మీ 5i, రియల్మీ 5s, రియల్మీ 5 ప్రో , రియల్మీ 3 ప్రో,  రియల్మీ X,  రియల్మీ XT, రియల్మీ X2     

2. మార్చి   : రియల్మీ 3i, రియల్మీ3, రియల్మీ 2 ప్రో, రియల్మీU1, రియల్మీ 1, రియల్మీ 2, రియల్మీ C1, రియల్మీ C2,  

 

https://twitter.com/realmemobiles/status/1220654978974605312?ref_src=twsrc%5Etfw

 

                 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :