5 వేలకే 5000mAh బ్యాటరీ రివర్స్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్!!

HIGHLIGHTS

లేటెస్ట్ బెస్ట్ ఫీచర్లతో వుంటుంది.

తక్కువ ధరలో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్

డిస్కౌంట్ అందుకొని మరింత చవకగా లభిస్తోంది

Gionee చాలా తక్కువ ధరకే ఇండియాలో గత సంవత్సరం విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ Gionee Max. ఈ స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరలో లేటెస్ట్ బెస్ట్ ఫీచర్లతో ఇండియాలో విడుదలయ్యింది. అయితే, నిన్నటి నుండి మొదలైన Flipkart సేల్ నుండి డిస్కౌంట్ అందుకొని మరింత చవకగా లభిస్తోంది. ఈ జియోనీ స్మార్ట్ ఫోన్ ఇంత తక్కువ ధరలో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన ఫోనుగా నిలుస్తుంది. 

Gionee Max: ధర

జియోనీ మాక్స్ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ తో తీసుకురాబడింది మరియు దీని ధర రూ .5,999. అయితే, Flipkart సేల్ నుండి కేవలం రూ.5499 రూపాయలకే లభిస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, రెడ్ మరియు రాయల్ బ్లూ వంటి మూడు రంగులలో ప్రవేశపెట్టబడింది. 

Gionee Max: స్పెసిఫికేషన్

ఈ జియోనీ మాక్స్ ఆండ్రాయిడ్ 10 లో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ లో 6.1-అంగుళాల హెచ్‌డి + డిస్ప్లే ఉంది, దీనికి 2.5 డి కర్వ్డ్ గ్లాస్ స్క్రీన్ రక్షణ ఇవ్వబడింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ Unisoc 9863A SoC శక్తిని కలిగి ఉంది మరియు 2GB RAM తో జత చేయబడింది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా అందించబడింది, దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

జియోనీ మాక్స్ 32 జిబి స్టోరేజ్ కలిగి ఉంది, దీనిని మైక్రో ఎస్డి కార్డ్ నుండి 256 జిబి వరకు పెంచవచ్చు. ఈ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది మరియు ఇది రివర్స్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం, జియోనీ మాక్స్ 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 4.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ మరియు మైక్రో యుఎస్‌బి పోర్ట్‌ను కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :