Gionee Max Pro: అతిపెద్ద బ్యాటరీతో రూ.6,999 ధరకే లాంచ్

Updated on 01-Mar-2021
HIGHLIGHTS

Gionee Max Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల

చవక ధరకే జియోని మ్యాక్స్ ప్రో

Gionee, ఈరోజు ఇండియాలో తన Max Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. జియోని మ్యాక్స్ ప్రో స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరకే మంచి ఫీచర్లతో తీసుకొచ్చింది. ఇందులో, పెద్ద స్క్రీన్, డ్యూయల్ కెమెరా, అతిపెద్ద బ్యాటరీ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటుగా మరిన్ని ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో విడుదల చేసింది.              

జియోని మ్యాక్స్ ప్రో: ధర

జియోని మ్యాక్స్ ప్రో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 6,999 రుపాయల ధరతో ప్రకటించింది.  ఫోన్ యొక్క మొదటి సేల్ మార్చ్ 8 న మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది.     

జియోని మ్యాక్స్ ప్రో : స్పెషిఫికేషన్స్

జియోని మ్యాక్స్ ప్రో స్మార్ట్ ఫోన్ పెద్ద 6.52 ఇంచ్ HD+ రిజల్యూషన్ గల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 2.5D కర్వ్డ్ గ్లాస్ తో వస్తుంది. ఈ ఫోన్ Unisoc 9863A ఆక్టా కొర్ చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఇది 1.6 GHz క్లాక్ స్పీడ్ గల ఆక్టా కోర్ ప్రొసెసర్. ఈ ప్రాసెసర్ కి జతగా 3GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది. డేడికేటెడ్ మెమొరీ కార్డుతో మెమోరిని మరింతగా పెంచుకోవచ్చు.

ఇక కెమెరా విభాగానికి వస్తే, జియోని మ్యాక్స్ ప్రో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 13MP ప్రధాన కెమెరా 2MP 2MP డెప్త్ సెన్సార్ లను కలిగివుంటుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని అందించారు. ఈ ఫోన్ అన్లాక్ తో మాత్రమే వస్తుంది ప్రింట్ సెన్సార్ ని ని అందివ్వదు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే పెద్ద బ్యాటరీని కలిగి వుంది. Max Pro , అతిపెద్ద 6,000 mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :