కేవలం రూ. 7,799 ధరకే లేటెస్ట్ 5G Smartphone అందుకోండి.!

Updated on 24-Jul-2025
HIGHLIGHTS

అతి చవక ధరలో లేటెస్ట్ 5G Smartphone కోసం సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్

లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7,799 ధరకే అందుకోండి

పెద్ద స్క్రీన్ మరియు పెద్ద బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది

అతి చవక ధరలో లేటెస్ట్ 5G Smartphone కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఈరోజు అమెజాన్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. అమెజాన్ ఈరోజు ఒక లేటెస్ట్ బెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7,799 ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ 5జి స్మార్ట్ ఫోన్ స్టైలిష్ డిజైన్ తో ఉండటమే కాకుండా 4 లక్షలకు పైగా AnTuTu స్కోర్ కలిగిన మంచి చిప్ సెట్, పెద్ద స్క్రీన్ మరియు పెద్ద బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. అంతగా ఊరిస్తున్న ఆ బెస్ట్ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ డీల్ ఏమిటో ఒక లుక్కేద్దామా.

ఏమిటా 5G Smartphone డీల్?

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ itel ఇటీవల విడుదల చేసిన ZENO 5G AI స్మార్ట్ ఫోన్ ఈ రోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. అదేమిటంటే, జెనో 5జి ఎఐ స్మార్ట్ ఫోన్ ఇటీవల ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 7,799 ధరలో లభిస్తుంది.

ప్రైస్ అండ్ ఆఫర్స్

జెనో 5జి ఎఐ స్మార్ట్ ఫోన్ (4 జీబీ + 128 జీబీ) అమెజాన్ నుంచి రూ. 10,999 ధరతో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ పైన అమెజాన్ రూ. 1,500 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 7,799 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ను HDFC మరియు Federal బ్యాంక్ కార్డ్స్ తో తీసుకునే వారికి ఈ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ మరియు ఫోన్ వివరాలు కోసం Check Here పై నొక్కండి.

Also Read: iQOO Z10R: స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!

ZENO 5G Smartphone : ఫీచర్లు

ఈ ఐటెల్ జెనో 5జి స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ బిగ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, HD + రిజల్యూషన్ మరియు డైనమిక్ బార్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5జి చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 4 జీబీ ఫిజికల్ ర్యామ్, 4 జీబీ అదనపు ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఐటెల్ ఐవాన ఎఐ సపోర్ట్ తో వస్తుంది.

ఈ ఐటెల్ స్మార్ట్ ఫోన్ వెనుక 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు ఆకట్టుకునే కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS తో వస్తుంది మరియు ఆండ్రాయిడ్ 15 అప్డేట్ అందుకుంటుంది. ఈ ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7.8mm స్లీక్ డిజైన్ తో కల్స్ టైటానియం, షాడో బ్లాక్ మరియు వేవ్ గ్రీన్ మూడు రంగుల్లో లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :