get flipkart goat sale big discount on Google Pixel 8a
Google Pixel 8a స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ GOAT Sale భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. సూపర్ కెమెరా ఫోన్ గా పేరొందిన గూగుల్ పిక్సెల్ గత జనరేషన్ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ కెమెరా, సెక్యూరిటీ కోసం ప్రత్యేకమైన చిప్ సెట్ మరియు మరిన్ని ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఫోన్ కేవలం 30 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అందించింది. ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో అందుకోవాలని చేస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఈ డీల్ పై ఒక లుక్కేయండి.
గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 52,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 37,999 బడ్జెట్ ధరలో సేల్ అవుతోంది అంతేకాదు, ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 7,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ గూగుల్ ఫోన్ కేవలం రూ. 30,999 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.
Also Read: iQOO Z10R : 32MP 4K సెల్ఫీ కెమెరా మరియు స్టైలిష్ డిజైన్ తో లాంచ్ అవుతోంది.!
గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ 24 Bit డెప్త్ మరియు 16 మిలియన్ కలర్స్ సపోర్ట్ కలిగిన 6.1 ఇంచ్ ఆక్టువ స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ రక్షణలో ఉంటుంది మరియు 1400 HDR బ్రైట్నెస్ సపోర్ట్ కలిగి ఉండటమే కాకుండా 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గూగుల్ Tensor G3 చిప్ సెట్ మరియు జతగా Titan M2 security చిప్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ లో జబర్దస్త్ కెమెరాని గూగుల్ అందించింది. ఇందులో వెనుక 64MP క్వాడ్ PD వైడ్ కెమెరా జతగా 13MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ గుట్టల కొద్దీ గూగుల్ కెమెరా ఫిల్టర్స్ మరియు కెమెరా ఫీచర్స్ తో పాటు 60FPS వద్ద 4K వీడియో షూట్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4,492 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో ఉంటుంది.