Realme లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ పైన భారీ అఫర్

Updated on 05-Apr-2021
HIGHLIGHTS

రియల్మీ నార్జో 30 ప్రో 5G తక్కువ ధరలో వచ్చిన 5G స్మార్ట్‌ఫోన్

DOLBY ATMOS మరియు Hi-Res ఆడియో సపోర్ట్

120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే

ఇటీవల రియల్మీ ఇండియాలో అతి తక్కవ ధరకే లాంచ్ చేసిన 5G స్మార్ట్‌ఫోన్ రియల్మీ నార్జో 30 ప్రో 5G స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్  అన్నింటికన్నా తక్కువ ధరలో వచ్చిన 5G స్మార్ట్‌ఫోన్ గా నిలుస్తుంది. ఈ రియల్మీ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.16,999 రూపాయల ధరలో డ్యూయల్ 5G తో వస్తుంది. అయితే, రియల్మీ అధికారిక వెబ్సైట్ నుండి ఈరోజు లేదా రేపటిలోగా ఈ ఫోన్ ను ప్రీపెయిడ్ అఫర్ ద్వారా కొనేవారికి రూ.1000 రూపాయల తక్కువ ధరకే అఫర్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క అన్ని వేరియంట్స్ పైన కూడా ఈ అఫర్ వర్తిస్తుంది. 

రియల్మీ నార్జో 30 ప్రో 5G స్మార్ట్ ఫోన్ DOLBY ATMOS మరియు Hi-Res ఆడియో సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే వంటి చాలా ఆకట్టుకునే ఫీచర్లతో విడుదల చేసింది.    

రియల్మీ నార్జో 30 ప్రో 5G : అఫర్ ధర

రియల్మీ నార్జో 30 ప్రో 6GB + 64GB వేరియంట్ ధర :Rs.15,999

రియల్మీ నార్జో 30 ప్రో 8GB + 128GB వేరియంట్ ధర :Rs.18,999 

ఈ అఫర్ రేపటితో ముగుస్తుంది.

రియల్మీ నార్జో 30 ప్రో 5G: స్పెషిఫికేషన్స్

ఇక రియల్మీ నార్జో 30 ప్రో పెద్ద 6.5 ఇంచ్ FHD+ రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ లేటెస్ట్ 5G ప్రాసెసర్, డైమెన్సిటీ 800U తో పనిచేస్తుంది. ఇది 2.4 GHz క్లాక్ స్పీడ్ గల ఆక్టా కోర్ ప్రొసెసర్ మరియు మాలి -G57 GPU తో వుంటుంది. దీనికి జతగా, 6GB/8GB ర్యామ్ మరియు 64GB/128GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది. ఆడియో పరంగా కూడా, Dolby Atmos మరియు Hi-Res సపోర్ట్ తో ఉంటుంది. 

రియల్మీ నార్జో 30 ప్రో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 48ఎంపీ ప్రధాన కెమెరా 110 డిగ్రీల 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్  కెమెరాకి జతగా 4CM మ్యాక్రో సెన్సార్ లను కలిగివుంటుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 16ఎంపీ సెల్ఫీ కెమెరాని అందించారు. ఈ ఫోన్, అన్లాక్ ఫీచర్లుగా ఫేస్ అన్లాక్ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. 

ఇక ఈ స్మార్ట్ ఫోన్ పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి వుంది. ఈ రియల్మీ నార్జో 30 ప్రో, పెద్ద 5,000 mAh బ్యాటరీని 30W డార్ట్ ఛార్జ్ సపోర్టుతో కలిగి వుంటుంది.                       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :