Moto G 9: ఈరోజు లాంచ్ అవ్వనున్నట్లు చెబుతున్న Flipkart టీజర్

Updated on 24-Aug-2020
HIGHLIGHTS

Moto G 9 స్మార్ట్ ఫోన్ ఈ రోజు భారతదేశంలో లాంచ్ కానుంది.

మోటరోలా తన మోటో జి 9 లేదా మోటో జి 9 సిరీస్ ‌ను లాంచ్ చేస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

మోటో జి 9 గొప్ప పనితీరు, గొప్ప కెమెరా మరియు శక్తివంతమైన బ్యాటరీతో అందించబడుతుంది.

Moto G 9 స్మార్ట్ ఫోన్ ఈ రోజు భారతదేశంలో లాంచ్ కానుంది. ఫ్లిప్ ‌కార్ట్ మరియు మోటరోలా కొంతకాలంగా “Something Big” లాంచ్ గురించి టీజ్ చేస్తున్నాయి. అయితే, ఏ స్మార్ట్‌ ఫోన్‌ ను లాంచ్ చేయబోతున్నారో మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే, Moto G 9 ను సోమవారం (ఆగస్టు 24)న లాంచ్ చేయనున్నట్లు లెనోవా యాజమాన్యంలోని సంస్థ URL లింక్‌లో తెలిపింది.

అయితే, మోటరోలా తన మోటో జి 9 లేదా మోటో జి 9 సిరీస్ ‌ను లాంచ్ చేస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. వాస్తవానికి, మోటో జి 9 ప్లస్ మరియు మోటో జి 9 ప్లే ఫోన్స్ లాంచ్ కోసం సోషల్ మీడియాలో చాలా డిమాండ్ ఉంది.

మోటరోలా ఇండియా ఈ కొత్త లాంచ్ గురించి ఫ్లిప్ ‌కార్ట్ టీజర్ పేజీని ట్విట్టర్ ‌లో షేర్ చేసింది. ఈ URL సంస్థ నుండి మోటో G9 పేరు తో కనిపించింది.

 

https://twitter.com/motorolaindia/status/1296678144238215168?ref_src=twsrc%5Etfw

 

ఆగస్టు 24 న మధ్యాహ్నం 12 గంటలకు ఈ కొత్త ఫోన్ ‌ను విడుదల చేయనున్నట్లు మోటరోలా టీజ్ చేసింది. ఏదేమైనా, సంస్థ దాని కోసం ఎటువంటి వర్చువల్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు, ఈ ఫోన్ లాంచ్ నేరుగా ప్రకటించబడుతుంది.

Moto G 9: అంచనా ఫీచర్స్

ఫ్లిప్ ‌కార్ట్ టీజర్ పేజి ప్రకారం, మోటో జి 9 గొప్ప పనితీరు, గొప్ప కెమెరా మరియు శక్తివంతమైన బ్యాటరీతో అందించబడుతుంది. ఏదేమైనా, సంస్థ యొక్క ఈ టీజింగ్ పోస్టర్ వివరాలు, ఫోన్ లాంచ్ స్పెసిఫికేషన్ల వివరాలు తెలిసే వరకు పూర్తిగా అర్ధం కావు. అయితే, శక్తివంతమైన బ్యాటరీ అంటే,  ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుందని ఉహించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :