ఊహకే అందని డిస్కౌంట్ అఫర్!! Flipkart స్మార్ట్ ఫోన్ కార్నివాల్ సేల్ నుంచి అందుకోండి

HIGHLIGHTS

Flipkart స్మార్ట్ ఫోన్ కార్నివాల్ సేల్

ఊహకే అందని డిస్కౌంట్ అఫర్

LG Wing స్మార్ట్ ఫోన్ పైన ఏకంగా 62% డిస్కౌంట్

Flipkart స్మార్ట్ ఫోన్ కార్నివాల్ సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ సేల్ నుండి ఊహకే అందని డిస్కౌంట్ అఫర్ ఒకదాన్ని ప్రకటించింది. అదేమిటంటే, LG Wing స్మార్ట్ ఫోన్ పైన ఏకంగా 62% డిస్కౌంట్ ప్రకటించింది.  గత సంవత్సరం ప్రీమియం సెగ్మెంట్ లో వచ్చిన ఈ ఫోన్,Flipkart స్మార్ట్ ఫోన్ కార్నివాల్ సేల్  నుండి డిస్కౌంట్ అఫర్ ద్వారా కేవలం మిడ్ రేంజ్ ధరకే లభిస్తోంది.

వాస్తవానికి, LG Wing స్మార్ట్ ఫోన్ MRP ధర మాత్రమే Rs.80,000. కానీ, 2020 అక్టోబరు లో ఈ ఫోన్ ను LG పరిచయం చేసినప్పుడు దీన్ని Rs.69,990 రూపాయల ధరతో పరిచయం చేసింది. కానీ ఈ ఫోన్ సూపర్ డిస్ప్లే, అద్భుతమైన కెమెరా మరియు డ్యూయల్ డిస్ప్లే వంటి మరిన్ని భారీ ఫీచర్లతో వస్తుంది. ప్రస్తుతం Flipkart అఫర్ నుండి ఇవ్వనున్నట్లు చూపిస్తున్న Rs.29,999 ధరకు మాత్రం ఇది సాటిలేని ఫోనుగా ఉంటుంది. Check Offer Here

LG Wing: ప్రత్యేకతలు

LG Wing  డ్యూయల్ స్క్రీన్ తో వస్తుంది. వీటిలో పెద్ద స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ గల 6.8-ఇంచ్ FHD+ డిస్ప్లేతో వుంటుంది. మరొక డిస్ప్లే 3.9 ఇంచ్ పరిమాణంతో వుంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఫాస్ట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 765G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ జతగా వస్తుంది.

ఇక కెమెరాల పరంగా ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 64MP కెమెరా OIS సపోర్ట్ తో వస్తుంది. దీనికి జతగా 13MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 12MP గింబాల్ అల్ట్రా వైడ్ కెమెరా వున్నాయి. ముందు భాగంలో, 32MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 4000mAh బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :