Flipkart సేల్ లో Realme 5G ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అఫర్

HIGHLIGHTS

Realme X50 Pro 5G స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్

Flipkart Shop From Home Days Sale లో ఈ అఫర్ మిస్సవ్వకండి

భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న Realme మీ ఫోన్

ఈరోజుతో ముగియనున్న Flipkart Shop From Home Days Sale నుండి Realme X50 Pro 5G  స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ అందుకోండి. రియల్మి ఈ ఫోన్ను అనేకమైన గొప్ప ప్రత్యేకతలతో పాటుగా అందించింది. ఇది రియల్మి నుండి వచ్చిన మొట్టమొదటి 5G స్మార్ట్ ఫోన్ మరియు భారీ ఫీచర్లతో వస్తుంది. ముందుగా, రూ. 39,999 ధరతో అమ్ముడైన ఈ స్మార్ట్ ఫోన్ Flipakrt సేల్ నుండి 15 వేల రూపాయల డిస్కౌంట్ తో అమ్మడవుతోంది. ఈ Flipkart సేల్ ఈరోజుతో ముగుస్తుంది కాబట్టి త్వరపడండి      

రియల్మీ X50 ప్రో 5G : అఫర్ ధర

Realme X50 Pro 5G : 8GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.24,999

Realme X50 Pro 5G : ప్రత్యేకతలు

ఈ X50 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ఒక 6.44 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేని 3D AG కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటెక్షన్ తో మరియు 20:9 ఆస్పెక్ట్ రేషియాతో తీసుకువచ్చింది. ఇందులో, డ్యూయల్ ఇన్ డిస్ప్లే కెమేరా (పంచ్ హోల్)తో పాటుగా AG గ్లాస్ టెక్నాలజీతో అందించింది. ఇది ఇక దీని డిస్ప్లే యొక్క స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే, ఇది HDR 10+ కి సపోర్ట్ చేయగల 90Hz డిస్ప్లేతో వస్తుంది. అంతేకాదు, ఇది 100% DCI-P3 మరియు 105% NTSC కలర్ గాముట్ తోపాటుగా 1000+ నిట్స్ బ్రైట్నెస్ వంటి గోప్ప ఫీచర్లతో వస్తుంది.                                            

ఇది క్వాల్కామ్ యొక్క అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ అయినటువంటి, క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 865 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది A77 పెరఫార్మెన్స్  కోర్స్ తో గరిష్టంగా 2.84GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. PUBG వంటి గేమింగ్ అల్ట్రా హై డెఫీనేషనుతో పాటుగా ఎటువంటి అంతరాయం లేకుండా గంటల తరబడి ఆడవచ్చు.  ఈ స్మార్ట్ ఫోనులో అందించిన 5 డైమాన్షనల్ వేపర్ కూలింగ్ టెక్నలాజితో ఈ ఫోన్ను నిరంతరం చల్లగా ఉంచుతుంది. దీని విశేషం ఏమిటంటే, ఇది ఫోన్ను వేడికాకుండా చల్లబరచడంలో మంచి పాత్ర వహిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది 5G సపోర్టుతో వస్తుంది మరియు ఇది ఇండియాలో విడుదలైన మొట్ట మొదటి 5G స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.  

ఈ ఫోన్ను మూడు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ప్రకటించింది. అవి : 6GB ర్యామ్ +64GB స్టోరేజి, 6GB ర్యామ్ +128GB మరియు 8GB + 256GB స్టోరేజి వంటి రెండు వేరియంట్లు . వీటి ధరలు ఈ క్రింద చూడవచ్చు. అంతేకాదు, ఇది వేగవంతమైన LPDDR5 RAM మరియు UFS 3.0  

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ ఫోనులో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఈ క్వాడ్ కెమెరాలో, f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక 64MP ప్రధాన కెమెరాని Samsung ISOCELL GW1 సెన్సారుతో ఇంచింది. ఇక రెండవ కెమేరా గురించి చూస్తే, ఇది ఒక f/2.3 అపర్చరు కలిగిన 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మీకు మ్యాక్రో ఫోటోలను కూడా తియ్యడానికి వెలుపడుతుంది. దీనికి జతగా 12MP టెలిఫోటో లెన్స్ (20Xజూమ్) మరియు నాలుగవ కెమేరాగా ఒక 2MP బ్లాక్ %& వైట్ పోర్ట్రైట్ సెన్సార్ ని కలిగి ఉంటుంది.  ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 32MP Sony IMX616 సెన్సార్ మరియు 8MP సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్లు జతగా గల డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమేరాతో మీరు సూపర్ సెల్ఫీ ఫోటోలు మరియు 120fps తో  స్లో మోషన్ వీడియోలను తీయ్యోచ్చు మరియు ఫోటోలను అద్భుతంగా చిత్రీకరించవచ్చు.

ఈ రియల్మీ X50 ప్రో 5G ఒక అతిపెద్ద 4,200mAh బ్యాటరీతో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని అత్యంత వేగవంతమైన 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా, బాక్స్ లోనే ఒక 10V/6.5A ఛార్జర్ కూడా అందించింది. ఈ అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 20 నిముషాల్లో 60% వరకూ బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు మరియు కేవలం 35 నిముషాల్లోనే ఫోన్ను పూర్తిగా ఛార్జ్ చెయ్యొచ్చు. ఇక ఇందులో అందించిన సౌండ్ టెక్నాలజీ గురించి చూస్తే, ఇందులో  డ్యూయల్ సూపర్ లైనర్ డ్యూయల్ స్పీకర్లను DOLBY ATMOS సరౌండ్ మరియు Hi-Res సౌండ్  టెక్నలాజిని అందించారు.           

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :