flipkart sale offers big discount offers on realme P4 5G
డ్యూయల్ చిప్ పవర్ తో వచ్చిన రియల్ మీ బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ Realme P4 5G ఈరోజు Flipkart Sale నుంచి చాలా చవక ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ గేమింగ్ చిప్ సెట్ తో పాటు గేమింగ్ మరియు విజువల్స్ కోసం ప్రత్యేకమైన AI చిప్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకుని చాలా చవక ధరలో లభిస్తోంది.
ఇండియాలో రూ. 18,499 ధరతో రీసెంట్ గా విడుదలైన రియల్ మీ పి4 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 1,500 డిస్కౌంట్ తో రూ. 16,999 ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై మరో భారీ డిస్కౌంట్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ మరియు UPI ఆప్షన్ తో పేమెంట్ చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది.
ఈ పైన తెలిపిన రెండు డిస్కౌంట్ ఆఫర్స్ అందిపుచ్చుకుంటే ఈ రియల్ మీ బడ్జెట్ గేమింగ్ ఫోన్ మీకు కేవలం రూ. 14,999 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.
Also Read: Sony Dolby Atmos స్మార్ట్ టీవీ పై అమెజాన్ దివాళి సేల్ నుంచి మంచి ఆఫర్స్ తో లభిస్తోంది.!
ఈ రియల్ మీ పి4 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా గొప్ప విజువల్స్ కోసం హైపర్ విజన్ AI చిప్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 144z రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ లోకల్ బ్రైట్నెస్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.77 ఇంచ్ హైపర్ గ్లో AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ రేవులో మీ బడ్జెట్ గేమింగ్ ఫోన్ మంచి కెమెరా సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP + 8MP జతగా మరో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ AI ఎడిట్ జీనీ కెమెరా ఫీచర్స్ మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ వంటి మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh టైటాన్ బిగ్ బ్యాటరీ మరియు 80W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7.58mm సూపర్ స్లిమ్ డిజైన్ మరియు IP65 అండ్ IP66 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంటుంది.