Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 7 వేలకే లభిస్తున్న POCO M6 5G స్మార్ట్ ఫోన్.!

HIGHLIGHTS

Flipkart Sale నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను అనౌన్స్ చేసింది

వలం 4G స్మార్ట్ ఫోన్ రేటుకే 5G స్మార్ట్ ఫోన్ ను అందుకునే అవకాశం

మంచి బడ్జెట్ 5G ఫోన్ గా పేరు తెచ్చుకున్న POCO M6 5G పై ఈ ఆఫర్ ను అందించింది

Flipkart Sale నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను అనౌన్స్ చేసింది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అందించిన ఈ ఆఫర్ తో కేవలం 4G స్మార్ట్ ఫోన్ రేటుకే 5G స్మార్ట్ ఫోన్ ను అందుకునే అవకాశం వుంది. గతంలో, 10 వేల బడ్జెట్ లో మంచి బడ్జెట్ 5G ఫోన్ గా పేరు తెచ్చుకున్న POCO M6 5G పై ఈ ఆఫర్ ను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో 7 వేల రూపాయల బడ్జెట్ లోనే లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ భారీ స్మార్ట్ ఫోన్ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Flipkart Sale : ఆఫర్

ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు ఈ గొప్ప 5G స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను అందించింది. పోకో ఎం6 5 స్మార్ట్ ఫోన్ (4GB+64) వేరియంట్ ను ఈరోజు 33% తో కేవలం రూ. 7,999 ధరకే లిస్ట్ చేసింది. ఈ ఫోన్ ను HDFC డెబిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అయితే, ఈ ఫోన్ ను ఈ ధరకు కొండానికి ఒక కండీషన్ వుంది.

అదేమిటంటే, ఈ ఫోన్ కేవలం Airtel Prepaid కస్టమర్లు మాత్రమే కొనుగోలు హన్స్ అవకాశం వుంది. ఎందుకంటే, ఎయిర్టెల్ రీచార్జ్ ప్లాన్ తో కండీషనల్ ఆఫర్ గా ఈ ఫోన్ ను సేల్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ కొనే వారికి 50GB ల అదనపు డేటాని కూడా ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది.

Also Read: రూ. 1,500 ధరలో మంచి ANC Buds డీల్స్ ఆఫర్ చేస్తున్న Flipkart BBD సేల్.!

POCO M6 5G: ఫీచర్స్

పోకో ఎం6 5 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.74 ఇంచ్ HD+ స్క్రీన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Dimensity 6100+ చి సేయఁ తో పని చేస్తుంది మరియు దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగివుంది.

ఈ ఫోన్ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మంచి స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :