Flipkart బిగ్ బచాత్ ధమాఖా సేల్ బిగ్ డిస్కౌంట్ స్మార్ట్ ఫోన్ డీల్.!

HIGHLIGHTS

Flipkart బిగ్ బచాత్ ధమాఖా సేల్ ను అనౌన్స్ చేసింది

ఈ సేల్ నుండి శామ్సంగ్ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది

ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరకే మీ సొంతం చేసుకోవచ్చు

Flipakrt తన ఆన్లైన్ ప్లాట్ ఫామ్ నుండి Flipkart బిగ్ బచాత్ ధమాఖా సేల్ ను అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుండి శామ్సంగ్ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S21 FE 5G ని భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ పూర్తి వివరాలను తెలుసుకోండి. 

Samsung Galaxy S21 FE 5G: ధర మరియు ఆఫర్లు

శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో రూ.49,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం ఈ ఫోన్ Flipkart బిగ్ బచాత్ ధమాఖా సేల్ నుండి 10,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ.39,999 అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ ఫోన్ ను IDFC మరియు BoB బ్యాంక్ క్రెడిట్ కార్ట్ మరియు EMI అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా అఫర్ చేస్తోంది.  

Samsung Galaxy S21 FE 5G:స్పెక్స్

శామ్సంగ్ గెలాక్సీ ఎస్21 FE 5జి స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ డైనమిక్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది.  ఈ ఫోన్ వేగవంతమైన పవర్ ఫుల్ 5G మరియు 4nm ప్రోసెసర్ Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ కి జతగా 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో,12MP ప్రధాన సెన్సార్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 8MP (OIS) టెలీ ఫోటో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,500 mAh బ్యాటరీని కలిగివుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా One UI 4.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది మరియు Android 13 OS అప్డేట్ ను వెంటనే అందుకుంటుంది.                     

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :