flipkart offers rs 5000 big discount on Google Pixel 8a smartphone
Google Pixel 8a స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ రూ. 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. పవర్ ఫుల్ కెమెరా కలిగిన ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ తో కేవలం 30 వేల రూపాయల కంటే తక్కువ ధరలోనే లభిస్తుంది. గూగుల్ బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ ని చౌక ధరలో కొనాలని చూసే యూజర్లు ఈ రోజు లభిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ డీల్ పరిశీలించవచ్చు.
గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 34,999 ధరకే లిస్ట్ చేసింది. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 52,999 ధరతో విడుదల అయింది. అయితే ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ చవక ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 5,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. HDFC క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 29,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: UPI Scams నుంచి మీ యూపీఐ యాప్స్ సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.!
గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ 6.1 ఇంచ్ FHD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్, గోరిల్లా గ్లాస్ 3, HDR సపోర్ట్ మరియు 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఈ గూగుల్ ఫోన్ మెటల్ ఫ్రేమ్ మరియు మ్యాట్ బ్యాక్ ఫినిష్ తో గొప్ప డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గూగుల్ యొక్క Tensor G3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా Titan M2 సెక్యూరిటీ కో ప్రోసెసర్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ 8 GB LPDDR5x ర్యామ్ మరియు 128GB (UFS 3.1) ఫాస్ట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ గూగుల్ ఫాలెన్ దూల రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో, 64MP మెయిన్ సెన్సార్ మరియు 13MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ 4K 60fps వీడియో రికార్డ్ సపోర్ట్ మరియు Magic Editor వంటి చాలా గూగుల్ ఫోటో ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 4K వీడియో సపోర్ట్ కలిగిన 13MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 4,492 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ గూగుల్ ఫోన్ IP67 రేటింగ్ తో నీరు మరియు ధూళి నుండి రక్షణ అందిస్తుంది.