Vivo T1 5G: ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి డిస్కౌంట్ అఫర్ తో సేల్ అవుతోంది..!!
Vivo T1 5G ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి డిస్కౌంట్ అఫర్ తో సేల్ అవుతోంది
Flipkart సేల్ నుండి గొప్ప బ్యాంక్ అఫర్ తో పొందవచ్చు
ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది
వివో లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Vivo T1 5G ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి డిస్కౌంట్ అఫర్ తో సేల్ అవుతోంది. ఇటీవల ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన ఈ వివో బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి గొప్ప బ్యాంక్ అఫర్ తో పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర, అఫర్ మరియు పూర్తి వివరాలను క్రింద చూడవచ్చు.
Surveyvivo T1 5G: ధర మరియు ఆఫర్లు
వివో ఇటీవల vivo T1 5G సార్ట్ ఫోన్ ను కేవలం రూ.15,999 ప్రారంభ ధరతో ప్రకటించింది మరియు ఇది 4GB మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. మరొక వేరియంట్ 6GB మరియు 128GB స్టోరేజ్ ధర రూ.16,999 మరియు హై ఎండ్ వేరియంట్ 8GB మరియు 128GB స్టోరేజ్ తో రూ.19,999 ధరతో వస్తుంది.
ఇక ఈ ఫోన్ పైన Flipkart సేల్ నుండి అందించిన ఆఫర్ల గురించి చూస్తే, ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ అఫర్ వుంది. అలాగే, అన్ని ప్రముఖ బ్యాంక్ ద్వారా No Cost EMI మరియు అతితక్కువ రెగ్యులర్ EMI తో కూడా ఈ ఫోన్ లభిస్తోంది. ఈ ఫోన్ ను పైన భారీ ఎక్స్ చేంజ్ అఫర్ ను కూడా అందించింది. Check Offer Here
vivo T1 5G: స్పెక్స్
Vivo T1 5G స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ LCD డిస్ప్లేని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం నోచ్ కటౌట్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకూ మెమోరిని మరింతగా విస్తరించవచ్చు.
ఇక కెమెరాల విభాగంలో, వివో T1 5జి ఫోన్ 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.