Flipkart సేల్ నుండి లేటెస్ట్ మోటోరోలా 108MP కెమెరా 5G ఫోన్ పైన భారీ డీల్స్

HIGHLIGHTS

Motorola Edge 20 Fusion పైన Flipkart భారీ డిస్కౌంట్

ఈ మోటో స్మార్ట్ ఫోన్ చాలా ప్రీమియం ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది

బ్యాంక్ డిస్కౌంట్ అధనంగా పొందవచ్చు

ఇండియాలో మోటోరోలా భారీ 108MP కెమెరా మరియు 5G రెడీ తో విడుదల చేసిన Motorola Edge 20 Fusion పైన Flipkart తన బిగ్ దివాళీ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 108 క్వాడ్ ఫిక్షన్ కెమెరా సిస్టం, 5G ప్రొసెసర్ మరియు మరిన్ని ఫీచర్లతో వచ్చింది. వాస్తవానికి, ఈ మోటో స్మార్ట్ ఫోన్ చాలా ప్రీమియం ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే, Flipkart Big Diwali Sale నుండి 1,000 రూపాయల డిస్కౌంట్ మరియు SBI కార్డ్స్ తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ ను కూడా అఫర్ చేస్తోంది.

Motorola Edge 20 Fusion: ప్రైస్

మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫోన్ 6జిబి మరియు 128జిబి స్టోరేజ్ తో రూ.21,499 రూపాయల ప్రారంభధరతో ప్రకటించబడింది. అయితే, Flipkart Big Diwali Sale నుండి ఈ ఫోన్ రూ.20,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో వుంది. బ్యాంక్ డిస్కౌంట్ అధనంగా పొందవచ్చు.  Buy From Here

Motorola Edge 20: స్పెసిఫికేషన్స్

మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్  6.7 ఇంచ్ FHD + రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ AMOLED డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్ Dimensity 800U ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 8జిబి ర్యామ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ సైబర్ టీఎల్ మరియు ఎలక్ట్రిక్ గ్రాఫైట్ అనే రెండు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

ఎడ్జ్ 20 ఫ్యూజన్ యొక్క కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. కానీ, ఇది క్వాడ్ కెమేరా పనులను చెయ్యగల శక్తితో వుంటుంది. ఇందులో 108MP ప్రధాన కెమెరా, అల్ట్రా వైడ్ మరియు మ్యాక్రో రెండిటికి సపోర్ట్ చేసే 8ఎంపి సెన్సార్ మరియు 2ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ కెమేరాతో 8X వరకూ డిజిటల్ జూమ్ చెయ్యవచ్చని కంపెని తెలిపింది. ముందుభాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ లో 30W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీ ఉంది మరియు టైప్ C ఛార్జర్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :