Flipkart బిగ్ దివాళీ సేల్ నుండి Poco X3 Pro పైన సూపర్ డీల్స్

HIGHLIGHTS

బిగ్ దివాళీ సేల్ నుండి సూపర్ డీల్స్

POCO X3 PRO బడ్జెట్ ధరలోనే

SBI క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 10% హ్యుజ్ డిస్కౌంట్

ఇటీవల ప్రీమియం ఫీచర్లతో మిబ్ రేంజ్ ధరలో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ POCO X3 PRO పైన Flipkart తన బిగ్ దివాళీ సేల్ నుండి సూపర్ డీల్స్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860 SoC మరియు UFS 3.1 అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ వంటి చాలా హై ఎండ్ ఫీచర్ లతో వచ్చింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి బడ్జెట్ ధరలోనే సొంతం చేసుకోవచ్చు. 

Poco X3 Pro: అఫర్ ధర

1. పోకో X3 ప్రో (6GB + 128GB) ధర : Rs.16,999

2. పోకో X3 ప్రో (8GB + 128GB) ధర : Rs.18,999    

పోకో X3 ప్రో స్మార్ట్ ఫోన్ పైన ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందిస్తోంది. SBI క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 10% హ్యుజ్ డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here  

Poco X3 Pro: ప్రత్యేకతలు

ఈ Poco X3 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేటుతో పాటుగా సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో వుంటుంది. ఈ స్క్రీన్ యొక్క రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 6 ని అందించింది. ఈ ఫోన్ వెనుక భాగంలో పోకో X3 మాదిరిగా చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్ ఉంది మరియు 215 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 9.4 మిమీ మందంతో వస్తుంది.

ఈ ఫోన్ గరిష్టంగా 2.96GHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 640 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB/8GB RAM మరియు 128GB UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12 పై పోకో లాంచర్ తో నడుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా చల్లబరచడానికి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ప్లస్ ఫీచర్ ని కూడా అందించింది.   

పోకో X3 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని , 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని, 2MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ తో కలిగివుంది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్ హోల్ కటౌట్ లోపల 20 MP  సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,160 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది. ఇక ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 6GB + 128GB వేరియంట్ EUR 199 ధరతో ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :