ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి Oppo K13 Turbo పై బిగ్ డీల్స్ ఆఫర్ చేస్తోంది.!

Oppo K13 Turbo స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ కార్ట్ బెస్ట్ డీల్స్ అండ్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. బిల్ట్ ఇన్ కూలింగ్ ఫ్యాన్ తో ఇండియాలో విడుదలైన మొదటి సూపర్ కూలింగ్ స్మార్ట్ ఫోన్ గా ఇది భారతీయ మొబైల్ మార్కెట్ లో చరిత్ర సృష్టించింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి గొప్ప డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.

Oppo K13 Turbo : ఆఫర్ ఏమిటి?

ఒప్పో కె13 టర్బో స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 27,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూడా ఇదే ధరతో సేల్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పైన ఫ్లిప్ కార్ట్ రెండు గొప్ప డీల్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.

లైక్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై ఒప్పో రూ. 3,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు రూ. 1068 రూపాయల ఫ్లిప్ కార్ట్ SBI అండ్ ఫ్లిప్ కార్ట్ Axis బ్యాంక్ కార్డ్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 23,931 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

Also Read: LG 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!

Oppo K13 Turbo : ఫీచర్స్

ఈ ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ AMOLED స్క్రీన్ ను 6.8-అంగుళాల AMOLED స్క్రీన్ తో కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ 4nm చిప్ సెట్ Dimensity 8450 తో పని చేస్తుంది. దీనికి జతగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఇండస్ట్రీలోనే ప్రత్యేక బిల్ట్-ఇన్ ఫ్యాన్ ఫీచర్ తో వచ్చిన మొదటి ఫోన్. ఇందులో 0.1 mm అల్ట్రా థిన్ బ్లేడ్స్ రో 18,000 RPM సామర్థ్యం తో తిరిగే ఫ్యాన్ కలిగి ఉంటుంది. ఇది ఫోన్ ను చాలా చల్లగా ఉంచుతుంది.

ఈ ఫోన్ లో 50 MP UHD ప్రధాన కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ కలిగిన రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 10x డిజిటల్ జూమ్, 60FPS 4K వీడియో సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మంచి సౌండ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ కూడా కలిగి ఉంటుంది.

IP66, 68 మరియు IP69 రేటింగ్ తో ఈ ఫోన్ మంచి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ 7000 mAh పెద్ద బ్యాటరీ మరియు వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు బైపాస్ ఛార్జ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :