Flipkart month end mobile festival sale offers big deals on OPPO K13x 5G
OPPO K13x 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఎక్కడ అని వెతుకుతున్నారా? డోంట్ వర్రీ, నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తాను. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఫ్లిప్ కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ డీల్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి అందించిన ఆఫర్స్ తో ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 9,999 రూపాయల అతి చవక ధరకే అందుకోవచ్చు.
ఒప్పో కె13x స్మార్ట్ ఫోన్ ఇండియాలో రీసెంట్ గా లాంచ్ అయ్యింది మరియు ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ నుంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (4GB+128GB) రూ.11,999 ధరతో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూడా ఇదే ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది. అలాగే, ఈ ఫోన్ (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 12,999 ధరతో మరియు (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 12,999 ధరతో లిస్ట్ అయ్యాయి.
అయితే, ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ అందించిన రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 9,999 ధరతో, మిడ్ వేరియంట్ రూ. 10,999 ధరలో మరియు హై ఎండ్ వేరియంట్ కూడా కేవలం రూ. 12,999 రూపాయల ధరలో లభిస్తాయి. ఎందుకంటే, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ లను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఫోన్ ను సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా UPI తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: Google Pixel 10: భారీ ఆఫర్స్ తో మొదలైన గూగుల్ కొత్త ఫోన్ సేల్.!
ఈ ఒప్పో బడ్జెట్ ఫోన్ మంచి డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 360 డిగ్రీ ఆర్మోర్ బాడీ, SGS 5 స్టార్ మరియు మిలటరీ గ్రేడ్ MIL-810H డిజైన్ బాడీ కలిగి ఉంటుంది. ఇందులో HD+ రిజల్యూషన్ కలిగిన 6.67 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఒప్పో ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది. ఇందులో 4GB / 6GB / 8GB ర్యామ్ ఆప్షన్ టి జతగా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఒప్పో బడ్జెట్ ఫోన్ FHD వీడియో రికార్డింగ్, AI అన్ బ్లర్, AI మోషన్ మరియు మరిన్ని AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 45W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ O Reality ఆడియో తో మంచి ఆడియో కూడా ఆఫర్ చేస్తుంది.