Nothing Phone (3): 80 వేల రూపాయల ఫోన్ పై 60 వేల రూపాయల డిస్కౌంట్ అందుకోండి.!

Updated on 05-Dec-2025
HIGHLIGHTS

నథింగ్ ఫోన్ 3 ఈరోజు 60 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది

Flipkart Buy Buy 2025 Sale నుంచి ఈ భారీ స్మార్ట్ ఫోన్ డీల్ అందించింది

ఈ డీల్ ఆషామాషీ డీల్ కాదండోయ్, 80 వేల రూపాయల ఫోన్ పై 60 వేల రూపాయల డిస్కౌంట్ అందించింది

Nothing Phone (3) : నథింగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 3 ఈరోజు 60 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు ఫ్లిప్ కార్ట్ చెబుతున్న మాట. 2025 ఇయర్ క్లోజింగ్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన Flipkart Buy Buy 2025 Sale నుంచి ఈ భారీ స్మార్ట్ ఫోన్ డీల్ అందించింది. ఈ డీల్ ఆషామాషీ డీల్ కాదండోయ్, 80 వేల రూపాయల ఫోన్ పై 60 వేల రూపాయల డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ బేస్ డీల్ వివరాలు మీకోసం అందిస్తున్నాం.

Nothing Phone (3) : డీల్

నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 79,999 ధర మరియు హై ఎండ్ వేరియంట్ రూ. 89,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూడా ఇదే ధరతో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది. అయితే, నథింగ్ ఈ ఫోన్ పై రూ. 30,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రూ. 30,000 రూపాయల UPI పేమెంట్ మరియు డెబిట్ / క్రెడిట్ కార్డ్ ఫుల్ పేమెంట్ ఆఫర్ అందించింది.

అంటే, ఈ ఫోన్ ను మీ ఏదైనా పాత ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేసి, మీ డెబిట్ లేదా UPI ద్వారా పేమెంట్ చేస్తే, ఈ ఫోన్ ను కేవలం రూ. 19,999 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచని ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. అయితే, మేము వెరిఫై చేసినప్పుడు కొన్ని సార్లు ఈ ఆఫర్ అప్లై అవ్వకపోవడం గమనించాము. మరి ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది లేదా ఈ ఆఫర్ కచ్చితమైన క్లోజింగ్ డేట్ ఏమిటి అనేది ఫ్లిప్ కార్ట్ క్లియర్ గా నోట్ అందించలేదు. కానీ, ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అని మెన్షన్ చేసింది. కాబట్టి, ఈ ఫోన్ కొనే ముందుగా ఈ ఆఫర్లు మీకు వర్తిస్తున్నాయో లేదో చెక్ చేసిన తరువాత మాత్రమే ఫోన్ కొనుగోలు చేయడం మంచిది.

Also Read: OnePlus 15R: 165Hz పవర్ ఫుల్ స్క్రీన్ మరియు SD Gen 5 కొత్త చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది.!

Nothing Phone (3) : ఫీచర్స్

ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ ను 1.5K (1260 × 2800) రిజల్యూషన్ మరియు 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ నథింగ్ ఫోన్ HDR10+ సపోర్ట్ తో పాటు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో మరియు వెనుక భాగం గొరిల్లా గ్లాస్ Victus రక్షణతో చాలా పటిష్టంగా ఉంటుంది. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్ తో చాలా ఆకర్షణీయమైన డిజైన్ తో ఉంటుంది. Glyph Matri ఈ ఫోన్ లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది.

ఈ నథింగ్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 12 జీబీ ర్యామ్ / 16 జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 256 జీబీ / 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందుతుంది. ఈ ఫోన్ Nothing OS 3.5 తో వస్తుంది మరియు వెంటనే ఆండ్రాయిడ్ 16 కు కూడా అప్డేట్ అందుకుంటుంది. ఇది 5 సంవత్సరాల OS అప్‌డేట్స్ మరియు 7 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అందుకుంటుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 50MP (OIS + PDAF) మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ మరియు 50MP పెరిస్కోప్ కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు గొప్ప కెమెరా ఫిల్టర్లు మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీ, 65W వైర్డ్ ఛార్జ్ సపోర్ట్, 15W వైర్లెస్ ఛార్జ్ అండ్ 5W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :