Flipkart సేల్ చివరి రోజు అఫర్: 13 వేల భారీ డిస్కౌంట్ తో IQOO ఫోన్ సేల్

Flipkart Big Saving Days సేల్ ఈరోజుతో ముగియనుంది. ఈ సేల్ చివరి రోజు సందర్భంగా  IQOO 3 స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ 5G మరియు 4G వేరియంట్లలో లభిస్తుంది. IQOO 3 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ తో వస్తుంది మరియు గత సంవత్సరం ఇండియాలో రూ. 37,990 ధరతో విడుదల చేయబడింది.

అయితే, IQOO 3 స్మార్ట్ ఫోన్ ఈ Flipkart సేల్ నుండి 13,000 రుపాయల డిస్కౌంట్ అందుకుని, కేవలం రూ.24,990 రూపాయల ధరకే లభిస్తోంది. అంతేకాదు, HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ అఫర్ కూడా వుంది. Click Here to BUY

IQOO 3 5G : టాప్ -5 ఫీచర్లు

1. డిస్ప్లే

ఈ IQOO 3 5G స్మార్ట్ ఫోన్ 6.44 అంగుళాల పరిమాణం గల SuperAMOLED డిస్ప్లే 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో మరియు పంచ్ హోల్ డిజైనుతో అందించింది. ఇక దీని డిస్ప్లే యొక్క స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే, ఇది HDR 10+ కి సపోర్ట్ చేయగల పోలార్ వ్యూ డిస్ప్లేతో వస్తుంది. అంతేకాదు, ఇది 800 నుండి  మొదలుకొని కొన్ని ప్రత్యేకపరిస్థితుల్లో గరిష్టంగా 1200+ నిట్స్ బ్రైట్నెస్ వంటి గోప్ప ఫీచర్లతో వస్తుంది.                                      

2. ప్రాసెసర్

ఇక పర్ఫార్మెన్స్ పరంగా, క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 865 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది A77 పెరఫార్మెన్స్  కోర్స్ తో గరిష్టంగా 2.84GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న Adreno 650 GPU కారణంగా గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయి మరియు హెవీ గేమ్స్ కూడా హై ఎండ్ లో ప్లే చేయవచ్చు.

3. ర్యామ్ & స్టోరేజి

ఈ ఫోన్ను రెండు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ప్రకటించింది. అవి : 8GB ర్యామ్ +128GB స్టోరేజి మరియు 8GB ర్యామ్ +128GB  అఫర్ ధరలు ఈ క్రింద చూడవచ్చు. అంతేకాదు, ఇది వేగవంతమైన LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్ కూడా వున్నాయి.

IQOO 3 : Flipkart అఫర్ ధరలు

1. IQOO 3 5G : 8GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.24,990/-

2. IQOO 3 5G : 8GB ర్యామ్ + 256GB స్టోరేజి : Rs.27,990/-

అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ కేవలం హై ఎండ్ వేరియంట్ అయినటువంటి 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజి మాత్రమే 5G సపోర్టుతో వస్తుంది. మిగిలిన రెండు వేరియంట్లు కూడా 4G సపోర్టుతో వస్తాయి.    

4. కెమేరా

ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఈ క్వాడ్ కెమెరాలో, f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక 48MP ప్రధాన కెమెరాని ఇంచింది. ఇక రెండవ కెమేరా గురించి చూస్తే, ఇది ఒక 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మేమియు దీనికి జతగా 13MP (f/2. 46) టెలిఫోటో లెన్స్ (20Xజూమ్) మరియు నాలుగవ కెమేరాగా ఒక 2MP డెప్త్ సెన్సార్ ని కలిగి ఉంటుంది.  ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 16MP(f/2.4) సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమేరాతో మీరు సూపర్ సెల్ఫీ ఫోటోలు మరియు స్లో మోషన్ వీడియోలను తీయ్యోచ్చు మరియు ఫోటోలను అద్భుతంగా చిత్రీకరించవచ్చు.

5. బ్యాటరీ

ఈ IQOO 3 5G ఒక అతిపెద్ద 4,440mAh బ్యాటరీతో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని అత్యంత వేగవంతమైన 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా, బాక్స్ లోనే ఒక స్పీడ్ ఛార్జర్ కూడా అందించింది. ఈ అత్యంత వేగవంతమైన ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 15 నిముషాల్లో 50% వరకూ బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు.             

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :