flipkart big deal on Realme 11 Pro 5G
రియల్ మి లేటెస్ట్ కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ Realme 11 Pro 5G ను ఫ్లిప్ కార్ట్ మంచి డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది. భారీ ఫీచర్స్ మరియు బిగ్ కెమేరా సెటప్ తో వచ్చిన ఈ రియల్ మి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు తక్కువ ధరకే లభిస్తోంది. ప్రీమియం డిజైన్ మరియు ప్రీమియం లెదర్ తో వచ్చిన ఈ రియల్ మి ఫోన్ ఆఫర్ ధర మరియు డీల్ పైన ఒక లుక్కేయండి.
రియల్ మి 11 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ రూ. 24,999 రూపాయల ప్రారంభ ధరలో మార్కెట్ లో లాంచ్ అయ్యింది. అయితే, ఈ రియల్ మి ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి రూ. 2,000 రూపాయల భారీ తగ్గింపుతో రూ. 22,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ను తక్కువ ధరలో కొనాలనుకునే వారికి మంచి అవకాశం అందించింది.
Also Read : Google Gemini: చాట్ జిపిటి కి పోటీగా కొత్త AI Model ని తెచ్చిన గూగుల్.!
రియల్ మి 11 ప్రో 5జి ప్రత్యేకతలు విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.7 ఇంచ్ OLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ కర్వ్డ్ విజన్ డిస్ప్లేని కలిగి వుంది. ఈ రియల్ మి ఫోన్ మీడియాటెక్ Dimensity 7050 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ColorOS V13.1.0 సాఫ్ట్ వేర్ తో Android 13 పైన పని చేస్తుంది.
రియల్ మి 11 ప్రో 5జి లో 100MP (OIS) + 2MP రియర్ కెమేరా సెటప్ మరియు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ లో అందించిన మెయిన్ కెమేరా తో 4K (at 30 fps) వీడియో రికార్డింగ్ అందిస్తుందని మరియు 20X జూమ్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం వెగాన్ లెథర్ డిజైన్ తో వస్తుంది మరియు 5000 బిగ్ బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.