మరికొన్ని గంటల్లో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ సేల్ లాస్ట్ డే iPhone 16 భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Updated on 24-Oct-2025
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ ఈరోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది

చివరి రోజు భారీ డీల్స్ అండ్ ఆఫర్లు ప్రకటించింది

ఈరోజు ఆపిల్ iPhone 16 ఫోన్ పై భారీ డీల్స్ మరియు ఆఫర్లు ప్రకటించింది

దీపావళి 2025 పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ ఈరోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది. అందుకే, చివరి రోజు భారీ డీల్స్ అండ్ ఆఫర్లు ప్రకటించింది. ఈ సేల్ నుంచి ఈరోజు ఆపిల్ iPhone 16 ఫోన్ పై భారీ డీల్స్ మరియు ఆఫర్లు ప్రకటించింది. సేల్ చివరి రోజు ప్రకటించిన ఈ బిగ్ డీల్ పై ఒక లుక్కేద్దామా.

iPhone 16 ఫ్లిప్ కార్ట్ ఆఫర్

ఐఫోన్ 16 ఫోన్ ఇండియాలో రూ. 79,900 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ చివరి రోజు భారీ డిస్కౌంట్ తో రూ. 57,999 రూపాయల ప్రైస్ తో తో లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రూ. 1,000 రూపాయల SBI బ్యాంక్ అదనపు డిస్కౌంట్ ని కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ లేటెస్ట్ ఐఫోన్ ని కేవలం రూ. 54,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ సేల్ ఈరోజుతో ముగుస్తుంది కాబట్టి ఈ ఆఫర్ ని ఈరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Also Read: అండర్ రూ. 4,000 జబర్దస్త్ సౌండ్ అందించే బెస్ట్ Soundbar డీల్స్.!

Apple iPhone 16 : ఫీచర్స్

ఆపిల్ ఐఫోన్ 16 ఫోన్ లేటెస్ట్ A18 Chip తో పని చేస్తుంది. ఈ ఫోన్ 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది మరియు ఈ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ లో కూడా లభిస్తుంది. ఈ ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ డైనమిక్ ఐల్యాండ్, ట్రూ టోన్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ కోటింగ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ iOS 18 తో వస్తుంది మరియు లేటెస్ట్ OS కి కూడా అప్డేట్ అందుకుంటుంది.

కెమెరా పరంగా, ఐఫోన్ 16 ఫోన్ లో వెనుక డ్యూయల్ రియార్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి మరియు ముందు 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో పాటు గొప్ప కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఒకరోజు బ్యాకప్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు మొత్తం 5 రంగుల్లో లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :