Google Pixel 9 పై 13 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ప్రకటించిన Flipkart BBD Sale.!

Updated on 11-Sep-2025
HIGHLIGHTS

Google Pixel 9 స్మార్ట్ ఫోన్ పై Flipkart BBD Sale బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది

గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ పై ఏకంగా రూ.13,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది

65 వేల రూపాయల ప్రైస్ తో సేల్ అవుతున్న ఈ ఫోన్ ను కేవలం 53 వేల రూపాయల ధరలో అందుకోవచ్చు

Google Pixel 9 స్మార్ట్ ఫోన్ పై Flipkart BBD Sale బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అనౌన్స్ చేసింది. ఆఫర్ అంటే చిన్నా చితకా ఆఫర్ కదండీ బాబోయ్ గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ పై ఏకంగా రూ.13,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. గూగుల్ యొక్క ఈ పవర్ ఫుల్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ అందించిన ఆఫర్స్ తో భారీ డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ ఫోన్ ను కేవలం 50 వేల బడ్జెట్ ధరలో అందుకోవాలని చూస్తున్న యూజర్లు ఈ డీల్ మిస్సవ్వకండి.

Google Pixel 9 Flipkart BBD Sale Deal

గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లిస్ట్ అయ్యింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ స్టార్ట్ కావడానికి ఇంకా 12 రోజుల సమయం ఉండగా, ఫ్లిప్ కార్ట్ మాత్రం ముందే ఈ డీల్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ తో 65 వేల రూపాయల ప్రైస్ తో సేల్ అవుతున్న ఈ ఫోన్ ను కేవలం 53 వేల రూపాయల ధరలో అందుకోవచ్చు.

ఇక ఆఫర్స్ విషయానికి, గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ రెండు ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు EMI మరియు నాన్ EMI పై రూ. 7,000 రూపాయల భారీ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా రూ. 5,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ పై రూ. 13,000 రూపాయల భారీ తగ్గింపు అందుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 52,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.

Also Read: బిల్ట్ ఇన్ హోమ్ థియేటర్ Panasonic Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్.!

Google Pixel 9 : ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ సూపర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ వెనుక 50MP మెయిన్ 48MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు 10.5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8x జూమ్, 4K వీడియో రికార్డింగ్, పిక్సెల్ కెమెరా ఫీచర్స్ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.3 ఇంచ్ 24-bit బిట్ డెప్త్ OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 60 Hz – 120 Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 మరియు 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ గూగుల్ ఫోన్ గూగుల్ Tensor G4 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 12GB ర్యామ్ తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ గూగుల్ ఫోన్ 4700 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ తో పాటు 6 నెలల గూగుల్ వన్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :