Flipkart BBD Sale 2025 నుంచి iPhone 16 పై భారీ రూ. 17,900 డిస్కౌంట్ అనౌన్స్.!

Updated on 11-Sep-2025
HIGHLIGHTS

iPhone 16 మరియు 16 Pro Max ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది

ఐఫోన్ 16 ని ఎన్నడూ చూడనంత చవక ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది

Flipkart BBD Sale 2025 సేల్ నుంచి ఈ బిగ్ డీల్స్ అందించింది

Flipkart BBD Sale 2025 సందర్భంగా ఈరోజు నిర్వహించిన లైవ్ కార్యక్రమం నుంచి ఈరోజు భారీ స్మార్ట్ ఫోన్ డీల్స్ అనౌన్స్ చేశారు. ఈ డీల్స్ అన్నింట్లో iPhone 16 మరియు 16 Pro Max ఫోన్ల పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. సెప్టెంబర్ 23 వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 నుంచి ఐఫోన్ 16 ని ఎన్నడూ చూడనంత చవక ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.

Flipkart BBD Sale 2025 : iPhone 16 డీల్

ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఐఫోన్ 16 మరియు 16 ప్రో మాక్స్ రెండు ఫోన్లు కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ లభిస్తాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అది కూడా ఈ రెండు ఫోన్లు ముందెన్నడూ లేనంత చవక ధరలో లభిస్తాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

iPhone 16 పై ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్ ఏమిటి?

ఐఫోన్ 16 పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 69,900 రూపాయల ధరతో సేల్ అవుతుండగా, బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 51,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అంటే, ఐఫోన్ 16 ఫోన్ ను ఏకంగా రూ. 17,901 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.

ఐఫోన్ 16 ఫోన్ A18 Chip చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 48MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా, 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR స్క్రీన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ 4K Dolby Vision వీడియో రికార్డింగ్ అందించే గొప్ప కెమెరా కలిగి ఉంటుంది.

Also Read: బాగా వైరలైన Action Figure Style 3D ఫోటోలు జస్ట్ సెకండ్స్ క్రియేట్ చేసుకోండి.!

ఐఫోన్ 16 ప్రో మాక్స్ డీల్ ఏమిటి?

ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్ పై మరింత భారీ డీల్ అందించింది. ఈ ఫోన్ ఇండియాలో రూ. 1,44,990 రూపాయల ధరతో వచ్చింది. ఈ ఫోన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి రూ. 54,901 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 89,999 రూపాయల ధరలో లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ఇంత తక్కువ ధరలో లభించడం ఇదే మొదటి సారి.

ఈ ప్రీమియం ఐఫోన్ లను భారీ డిస్కౌంట్ తో మంచి ఆఫర్ ధరలో అందుకోవాలంటే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వరకు వేచి చూడాల్సిందే.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :