flipkart announced Valentines Day 2026 big surprise deal on iphone 17
Valentines Day 2026 సందర్భంగా ఫ్లిప్ కార్ట్ iPhone 17 పై బిగ్ సర్ప్రైజ్ డీల్ అందించింది. వాలంటైన్స్ వీక్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇప్పటికే చాలా ప్రొడక్ట్స్ పై గొప్ప డీల్స్ మరియు ఆఫర్లు ఫ్లిప్ కార్ట్ తన యూజర్ల కోసం అందించింది. అయితే, ఈ రోజు ఈ కొత్త డీల్ ను ప్రత్యేకంగా వాలంటైన్స్ డే కోసం అందించింది. ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ 17 పై కొత్తగా అందించిన డీల్స్ మరియు ఆఫర్లు గురించి మరింత వివరంగా తెలుసుకోండి.
వాలంటైన్స్ డే 2026 సందర్భంగా ఈ డీల్ ను అందించినట్లు ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. మొబైల్ ఆఫర్స్ పేజీ నుంచి ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుండి ఈ ఐఫోన్ డీల్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ ప్రకారం, ఈ సేల్ నుంచి ఐఫోన్ 17 ఫోన్ ను అన్ని ఆఫర్స్ తో కేవలం రూ. 74,900 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చని చెబుతోంది. ఈ ఫోన్ ను ఇంత తక్కువ ధరలో ఎలా పొందాలి మరియు మీ ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేస్తే ఈ ఫోన్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది మరియు ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన బ్యాంక్ డీల్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 82,900 రూపాయల ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ పై రూ. 6,000 రూపాయల ఫ్లిప్ కార్ట్ Axis బ్యాంకు కార్డు అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, మీరు ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ తో ఈ ఫోన్ మీకు రూ. 76,900 రూపాయల ధరలో లభిస్తుంది. ఇది కాకుండా అదనపు ఫోన్ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై అందించింది. ఈ ఫోన్ రూ. 2,000 నుంచి రూ. 5,000 రూపాయల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ ప్రకటించింది.
అయితే, నేను చెక్ చేసిన చాలా ఫోన్స్ కు కేవలం రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ మాత్రమే ఇస్తున్నట్లు చూపించింది. ఒకవేళ మీ పాత ఫోన్ ఎక్స్ చేంజ్ తో కూడా కేవలం రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను పరిగణనలోకి తీసుకుంటే కూడా మీకు రూ. 2,000 రూపాయల అదనపు తగ్గింపు లభించినట్లు అవుతుంది. ఇలా చూసుకుంటే, మీకు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఐఫోన్ 17 పై రూ. 8,000 టోటల్ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఐఫోన్ 17 మీకు కేవలం రూ. 74,900 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Also Read: కేవలం ఇయర్ బడ్స్ ధరకే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
ఐఫోన్ 17 ఫోన్ 6.3 ఇంచ్ సూపర్ రెటీనా XDR స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3nm టెక్నాలజీ కలిగిన A19 Chip తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇది iOS 26 అంటే లేటెస్ట్ ఆపిల్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 48MP + 48MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 18MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. 4K Dolby Vision HDR వీడియో మరియు సూపర్ ఇమేజ్ లను అందిస్తుంది.